ప్రేమోన్మాది చేతిలో బలైన యువతి కుటుంబానికి రూ.10 లక్షలు సాయం 

 వైయ‌స్ఆర్ జిల్లా:  బద్వేల్ లో ప్రేమోన్మాది చేతిలో బ‌లైన  యువతి కుటుంబానికి వైయ‌స్ఆర్‌సీపీ అండ‌గా నిలిచింది. పార్టీ అధినేత వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ఇటీవ‌ల ఆ క‌టుంబాన్ని ప‌రామ‌ర్శించి రూ.10 ల‌క్ష‌ల ఆర్థిక సాయాన్ని ప్ర‌క‌టించారు.  వైయస్ జగన్ ఆదేశాల మేరకు ఇవాళ బాధిత కుటుంబ స‌భ్యుల‌ను బద్వేల్ వైయస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్యే డాక్టర్ దాసరి సుధ, ఎమ్మెల్సీ గోవింద రెడ్డి, పార్టీ నేతలు క‌లిసి రూ.10 లక్ష‌ల ఆర్థిక‌సాయం అంద‌జేశారు.   ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వం పై ఉంద‌ని వైయ‌స్ఆర్‌సీపీ నేతలు హెచ్చ‌రించారు. ఈ సందర్భంగా బాధిత కుటుంబ స‌భ్యులు వైయ‌స్ జ‌గ‌న్‌కు కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు.

Back to Top