స్కిల్‌ కుంభకోణంలో పవన్‌కు ప్యాకేజీ 

బాబు సీట్లో బాలకృష్ణ కూర్చున్న 48 గంటల్లోనే రంగంలోకి ప‌వ‌న్‌

మంత్రి రోజా కీలక వ్యాఖ్యలు

విజయవాడ:  ప్యాకేజీ కోసం జనసేన కార్యకర్తలను పవన్‌ తాకట్టు పెట్టాడని మంత్రి ఆర్కే రోజా విమర్శించారు. వార్డు మెంబర్‌గా కూడా గెలవని పవన్‌.. ముఖ్యమంత్రి వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డిని ఏమీ చేయలేరని స్పష్టం చేశారు. మంత్రి రోజా శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ.. స్కిల్‌ కుంభకోణంలో పవన్‌ ప్యాకేజీ తీసుకున్నాడు. చంద్రబాబుది అక్రమ కేసు కాదు.. అడ్డంగా దొరికిపోయిన కేసు. చంద్రబాబు సీట్లో బాలకృష్ణ కూర్చున్న 48 గంటల్లోనే పవన్‌ కల్యాణ్‌ను రంగంలోకి దింపాడు. చంద్రబాబు తప్పు చేయకపోతే బాబు ఆస్తులపై సీబీఐకి డిమాండ్‌ చేయాలి. పవన్‌కు కనీస జ్ఞానం కూడా లేదు. 13 చోట్ల చంద్రబాబు సంతకాలు పెట్టి దొరికిపోయిన దొంగ. స్కిల్‌ కుంభకోణంలో ఐటీ, జీఎస్టీ, ఈడీలు విచారణలు జరిపాయి. బాలకృష్ణ.. తన తండ్రి మీద చెప్పులేసిన చంద్రబాబునే ఏమీ చేయలేకపోయాడు. ఇంక, సీఎం జగన్‌ను ఏం చేయగలడు. నిజంగా స్కిల్‌ కుంభకోణంలో చంద్రబాబుకు తప్పు చేయకపోతే సీబీఐ, ఈడీ విచారణ కోరాల‌ని మంత్రి కామెంట్స్‌ చేశారు. 

Back to Top