ప్రతీ ఒక్కరూ ఆడపిల్లలను గౌరవించాలి

మంత్రి ఆర్కే రోజా

విజయవాడలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు 

వివిధ రంగాల్లో రాణించిన మహిళలకు సన్మానం

విజయవాడ: ప్రతీ ఒక్కరూ ఆడపిల్లలను గౌరవించాలని మంత్రి ఆర్కే రోజా కోరారు.  మంగళవారం విజయవాడలో అంతర్జాతీయ మహిళా  దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వివిధ రంగాల్లో రాణించిన మహిళలను సన్మానించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు ఆర్కే రోజా, విడదల రజిని, మహిళా కమిషన్‌ చైర్‌పర్సన్‌ వాసిరెడ్డి పద్మ తదితరులు పాల్గొన్నారు. వేడుకల్లో మంత్రి రోజా మాట్లాడుతూ.. దిశా యాప్‌తోమహిళలకు భద్రత, భరోసా వచ్చిందని అన్నారు. ప్రతి మహిళా దిశా యాప్‌ను వినియోగించుకోవాలని మంత్రి సూచించారు. 
మంత్రి విడదల రజని మాట్లాడుతూ..ఏపీలో మహిళలకే 90 శాతం సంక్షేమ పథకాలు అందుతున్నాయని పేర్కొన్నారు.  పదవుల్లోనూ మహిళలకు సీఎం వైయస్‌ జగన్‌ ప్రాధాన్యత  ఇస్తున్నారని చెప్పారు. కేబినెట్‌లో కూడా మహిళలకు సముచిత స్థానం దక్కిందని చెప్పారు.

 ఏపీలో సంక్షేమ పథకాలతోప్రతిరోజూ మహిళా దినోత్సవమే అని మహిళా కమిషన్‌ చైర్‌పర్సన్‌ వాసిరెడ్డి పద్మ అన్నారు.  మహిళల కోసం సీఎం వైయస్‌ జగన్‌ ఒక యజ్ఞం చేస్తున్నారని తెలిపారు. ఏపీలో మహిళలకు 50 శాతం రిజర్వేషన్లు కల్పిస్తున్నారని తెలిపారు. మహిళల రక్షణకోసం విప్లవాత్మక మార్పులు తెచ్చారని కొనియాడారు. 

 

తాజా వీడియోలు

Back to Top