చౌక ధరల దుకాణాల్లో సన్నబియ్యం పంపిణీ ప్రారంభం

శ్రీకాకుళం జిల్లాలో బియ్యం పంపిణీ ప్రారంభించిన సీఎం వైయస్‌ జగన్‌ 

ఏప్రిల్ నాటికి రాష్ట్ర వ్యాప్తంగా అమలు

శ్రీకాకుళం: ప్రజలకు 'స్వర్ణ' రకం వంటి క్వాలిటీ కలిగిన సన్న బియ్యాన్ని అందించాలన్న లక్ష్యంతో ముందుకు సాగుతున్నానని ముఖ్యమంత్రి వైయస్‌ జగన్ మోహన్‌ రెడ్డి తెలిపారు. సన్న బియ్యం పథకాన్ని సీఎం ప్రారంభించారు. శ్రీకాకుళం జిల్లాలోనే పైలట్ ప్రాజెక్టుగా క్వాలిటీ కలిగిన బియ్యాన్ని అందించడం ప్రారంభిస్తానని, ఆరు నెలల పరిశీలన అనంతరం ఏప్రిల్ నాటికి రాష్ట్ర వ్యాప్తంగా అందుబాటులోకి తెస్తామని అన్నారు. ప్రతి పేదకూ ఆకలి తీరాలన్నదే తమ ప్రభుత్వ లక్ష్యమని, క్వాలిటీ పెంచిన బియ్యాన్ని ప్రతి ఒక్కరికీ దగ్గర చేస్తానని అన్నారు. ఇందుకోసం ఇప్పటికే ప్రణాళికలు సిద్ధమైపోయాయని చెప్పుకొచ్చారు. ఈ బియ్యం ప్రతి లబ్దిదారుని గడపకూ చేరుతాయని చెప్పారు. 
చౌక ధరల దుకాణాల్లో ప్రజలు తీసుకుంటున్న బీయాన్ని, రూపాయి, రెండు రూపాయలకు తిరిగి విక్రయిస్తున్న పరిస్థితిని పోగొడతానని ఏపీ సీఎం వైయస్ జగన్ వ్యాఖ్యానించారు. ఈ ఉదయం శ్రీకాకుళంలో జరిగిన బహిరంగ సభలో మాట్లాడిన ఆయన, ప్రజలకు ఇచ్చిన బియ్యాన్ని వారి నుంచే కొనుగోలు చేస్తున్న డీలర్లు, తిరిగి దాన్నే ప్రభుత్వానికి అమ్ముతున్నారని, ప్రభుత్వం మళ్లీ ఆ బియ్యాన్నే ప్రజలకు అందిస్తోందని, ఇకపై ఇలా జరగదని చెప్పారు.

Back to Top