ఆస్పత్రుల్లో ఆక్సిజన్, మెడిసిన్, బెడ్స్‌ కొరత లేదు

కరోనా బాధితులకు మెరుగైన వైద్య సేవలు

డిప్యూటీ సీఎం, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని

తిరుపతి: కరోనా కట్టడికి ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలు చేపట్టిందని డిప్యూటీ సీఎం, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని అన్నారు. వ్యాక్సినేషన్, కోవిడ్‌ నియంత్రణపై చిత్తూరు జిల్లా ప్రజాప్రతినిధులు, వైద్య ఆరోగ్య శాఖ అధికారులతో మంత్రి ఆళ్ల నాని సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి ఆళ్ల నాని మాట్లాడుతూ.. ఆస్పత్రుల్లో ఆక్సిజన్, మెడిసిన్, బెడ్స్‌ కొరతలు లేవన్నారు. సిమ్స్, రుయా ఆస్పత్రుల్లో సౌకర్యాలు, కోవిడ్‌ పేషెంట్లకు అందుతున్న వైద్యం, ఆహారం, శానిటేషన్‌ వంటి అంశాలపై సమీక్షించడం జరిగిందన్నారు. ప్రభుత్వం, ప్రైవేట్‌ తేడా లేకుండా అన్ని ఆస్పత్రుల్లో ఆక్సిజన్‌ కొరత లేకుండా ప్రణాళిక బద్ధంగా ఉపయోగించే విధంగా దిశానిర్దేశం చేశామన్నారు. నియోజకవర్గాల వారీగా కోవిడ్‌ కేర్‌ సెంటర్లను ఏర్పాటు చేసే దిశగా చర్యలు తీసుకుంటామని అధికారులు చెప్పారని మంత్రి ఆళ్ల నాని తెలిపారు. తిరుప‌తి ఎస్వీయూ సెనేట్‌ హాలులో జరిగిన ఈ సమావేశానికి డిప్యూటీ సీఎం నారాయణస్వామి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఎంపీలు, ఎమ్మెల్యేలు, అధికారులు పాల్గొన్నారు. 

 

తాజా వీడియోలు

Back to Top