తాడేపల్లి: 2022–23 ఆర్థిక సంవత్సరంలో హౌసింగ్ కోసం రూ.10,203 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తే..రోజుకు రూ.28 కోట్ల రూపాయల చొప్పున ఖర్చు అయ్యిందని, 2023–24 ఆర్థిక సంవత్సరంలో రూ.15,810 కోట్లు ఖర్చు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని అధికారులు ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డికి వివరించారు. ఈ లెక్కన రోజుకు రూ.43 కోట్ల చొప్పున ఖర్చు చేయాలని నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. హౌసింగ్‌పై ఏపీ చేస్తున్న ఖర్చు కొన్ని చిన్న రాష్ట్రాల బడెట్ కన్నా అధికమని అధికారులు వివరించారు. ముగిసిన ఆర్థిక సంవత్సకంలో హౌసింగ్‌పై పెట్టిన ఖర్చును సీఎం వైయస్ జగన్‌కు అధికారులు వివరించారు. కొన్ని కేంద్ర ప్రభుత్వ శాఖల్లో కూడా ఇంత బడ్జెట్ లేదన్నారు. పేదలందరికీ ఇళ్లు పథకానికి ప్రభుత్వం ఇస్తున్న ప్రాధాన్యతకు ఇది నిదర్శనమని అధికారులు తెలిపారు. ఇప్పటివరకూ 3,40,741 ఇళ్లు పూర్తయ్యాయన్నారు. శ్లాబ్ పూర్తి చేసుకున్నవి, శ్లాబుకు సిద్ధంచేసినవి.. 4,67,551 ఇళ్లు ఉన్నాయని చెప్పారు. ఇవి కొన్నిరోజుల్లో పూర్తవుతాయని చెప్పారు. మిగిలినవి వివిధ దశల్లో ఉన్నాయని అధికారులు సీఎం దృష్టికి తీసుకెళ్లారు. ముఖ్యమంత్రిగారి ఆదేశాల మేరకు ఇళ్ల నిర్మాణాల్లో నాణ్యత పాటించేలా అన్నిరకాల చర్యలు తీసుకుంటున్నామని అధికారులు పేర్కొన్నారు. నిర్మాణాల్లో ఉపయోగించే రాయి, సిమెంటు, స్టీలు.. తదితర సామగ్రిపై పరీక్షలు నిర్వహిస్తున్నామని వెల్లడించారు. మొత్తంగా 4529 పరీక్షలు చేశామని, 2 శాతం మేర లోపాలు కనిపిస్తే వెంటనే తగిన చర్యలు తీసుకున్నామన్న అధికారులు. నాణ్యత విషయంలో ఎక్కడా రాజీపడవద్దని మరోసారి సీఎం వైయస్ జగన్ మోహన్ రెడ్డి స్పష్టం చేశారు. గృహ నిర్మాణ శాఖపై గురువారం సీఎం వైయస్ జగన్ మోహన్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. సీఎం వైయస్ జగన్ ఏమన్నారంటే.. టిడ్కో ఇళ్ల మీద జరుగుతున్న అసత్య ప్రచారం, విష ప్రచారం అంతా ఇంత కాదు వాటిని ఎప్పటికప్పుడు తిప్పికొట్టాలి ఇళ్ల నిర్మాణం జరుగుతున్న జగనన్న కాలనీల్లో మౌలిక సదుపాయాలపై సీఎం సమీక్ష. కరెంటు, తాగునీరు సహా మౌలిక సదుపాయాలను కల్పిస్తున్నామన్న అధికారులు. జగనన్న కాలనీల్లో డ్రైనేజీ వ్యవస్థపై దృష్టిపెట్టాలన్న సీఎం. ప్రతి ఇంటికీ కూడా సోక్పిట్స్ ఏర్పాటు చేస్తున్నామన్న అధికారులు. భవిష్యత్తులో వాననీటిని భూమిలోకి ఇంకించేలా చేయడానికి ఇవి ఉపయోగడతాయన్న అధికారులు. టిడ్కో ఇళ్లపైనా సీఎం సమీక్ష. టిడ్కో ఇళ్ల మీద జరుగుతున్న అసత్య ప్రచారం, విష ప్రచారం అంతా ఇంత కాదు: సీఎం వాటిని ఎప్పటికప్పుడు తిప్పికొట్టాలి: తమ ప్రభుత్వ హాయంలో టిడ్కో ఇళ్ల నిర్మాణాన్ని టీడీపీ పూర్తిగా పక్కన పెట్టింది. తమ హయాంలో టీడీపీ ఒక్క లబ్ధిదారునికి కూడా ఇళ్లు ఇవ్వలేకపోయింది: మన ప్రభుత్వ హయాంలో వాటిని పూర్తి చేస్తూ... మంచి మౌలిక సదుపాయాలుతో లబ్ధిదారులకు అప్పగిస్తున్నాం: టిడ్కో ఇళ్ల రూపంలో లబ్ధిదారులకు రూ.21 వేల కోట్ల విలువైన లబ్ధి చేకూర్చాం: ఈ వాస్తవాలను ప్రజలముందు ఉంచాలి. టిడ్కో ఇళ్ల నిర్మాణానికి సంబంధించి గత ప్రభుత్వ హయాంలోనూ, ప్రస్తుత ప్రభుత్వంలో జరిగిన పనులు వివరాలను సీఎంకు తెలిపిన అధికారులు. టిడ్కో ఇళ్ల నిర్మాణానికి టిడిపి, ప్రస్తుత ప్రభుత్వం హయాంలో చేçపట్టిన ఖర్చులను వివరించిన అధికారులు. టిడ్కో ఇళ్లు నాడు –నేడు. గతంలో టీడీపీ హాయంలో 300 చదరపు అడుగుల ఇళ్ల లబ్ధిదారులు రూ.2.65 లక్షల చొప్పున రుణాన్ని చెల్లించాల్సి ఉండగా... అది 20 ఏళ్లలో వడ్డీతో కలిసి రూ.7.20 లక్షలు కానున్న రుణం. ఈ ప్రభుత్వ హయాంలో 300 చదరపు అడుగుల ఇళ్లు పూర్తిగా ఉచితం. 365 చదరపు అడుగుల కేటగిరీలో యూనిట్‌కు రూ.50వేలు, 430 చదరపు అడుగుల కేటరిగీలో యూనిట్‌కు రూ.1 లక్ష రూపాయలు ముందస్తుగా తీసుకున్న టీడీపీ ప్రభుత్వం. ఇలా లబ్దిదారులు చెల్లించిన మొత్తంలో 50 శాతం రాయితీ రూపంలో ప్రస్తుత ప్రభుత్వం అందించిన సాయం రూ. 482 కోట్లు. దీనికి అదనంగా 2.62 లక్షల మంది లబ్ధిదారులకు ఉచితంగా రిజిస్ట్రేషన్లు చేయడం ద్వారా ప్రస్తుత ప్రభుత్వ హయాంలో చేకూరిన లబ్ధి రూ. 12,011 కోట్లు. చంద్రబాబు హయాంలో 2015 నుంచి 2019 వరకు లబ్ధిదారులకు బ్యాంకు రుణాల టైఅప్ రూ.78.08 కోట్లు కాగా... ఈ ప్రభుత్వం హయాంలో 2019 నుంచి ఇప్పటివరకు కేవలం మూడేళ్లలో లబ్ధిదారులకు బ్యాంకులతో టైఅప్ అయిన రుణం మొత్తం రూ.1875 కోట్లు 2015 –19 మధ్య టీడీపీ హయాంలో లబ్ధిదారులకు ఒక్కటంటే ఒక్క ఇళ్లు కూడా రిజిస్ట్రేషన్ జరగకపోగా... మే 2019 నుంచి ఇప్పటివరకు ఈ ప్రభుత్వ హయాంలో రిజిస్ట్రేషన్ జరిగిన ఇళ్ల సంఖ్య 1,55,673. 2015–19 మధ్యలో లబ్ధిదారులకు అప్పగించిన ఒక్క ఇళ్లూ అప్పగించని టీడీపీ ప్రభుత్వం. ప్రస్తుత ప్రభుత్వ హయాంలో లబ్ధిదారులకు అప్పగించిన ఇళ్లు 48,172. 2015–19 మధ్యలో ఇళ్ల నిర్మాణం, మౌలిక సదుపాయాలు, హడ్కోకు రుణాల చెల్లింపుతో వంటి వాటిపై టీడీపీ ప్రభుత్వం చేసిన ఖర్చు రూ.8645 కోట్లు కాగా... వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పటివరకు ఇళ్ల నిర్మాణం, మౌలికసదుపాయాలు, హడ్కోకు రుణాల చెల్లింపుకోసం చేసిన ఖర్చు రూ. 9044 కోట్లు. దీంతో పాటు రూ. 1 కే 300 చదరపుఅడుగుల ఇళ్ల కేటాయించడం ద్వారా రూ.10,339 కోట్ల రూపాయలు భారాన్ని భరించిన ప్రభుత్వం. తద్వారా ప్రయోజనం పొందనున్న 1,43,600 మంది లబ్ధిదారులు. టిడ్కో ఇళ్ల నిర్మాణంలో మొత్తంగా లబ్దిదారులకు చేకూరిన లబ్ది రూ.21 వేల కోట్లు. కాగా టీడీపీ హయాంలో చేసిన ఖర్చు కేవలం రూ. 8,723.08 కోట్లు మాత్రమే. 1.50 లక్షల మందికి జూన్ 2023 నాటికి , మరో 1.12 లక్షల మందికి డిసెంబరు 2023 నాటికి ఇళ్లు అప్పగిస్తామన్న అధికారులు. ఈ సమీక్షా సమావేశంలో గృహనిర్మాణశాఖ మంత్రి జోగి రమేష్, పురపాలక, పట్టణాభివృద్ధిశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్, సీఎస్ డాక్టర్ కె ఎస్ జవహర్ రెడ్డి, ఏపీస్టేట్ హౌసింగ్ కార్పొరేషన్ లిమిటెడ్ చైర్మన్ దవులూరి దొరబాబు, టిడ్కో చైర్మన్ జమ్మాన ప్రసన్నకుమార్, పురపాలక, పట్టణాభివృద్ధిశాఖ స్పెషల్ సీఎస్ వై శ్రీలక్ష్మి, గృహనిర్మాణశాఖ స్పెషల్ సీఎస్ అజయ్ జైన్ ఇంధనశాఖ స్పెషల్ సీఎస్ కె విజయానంద్, ఆర్ధికశాఖ కార్యదర్శి కె వి వి సత్యనారాయణ, హౌసింగ్ స్పెషల్ సెక్రటరీ మహమ్మద్ దివాన్, ఏపీ హౌసింగ్ కార్పొరేషన్ లిమిటెడ్ ఎండీ లక్ష్మీషా, టిడ్కో ఎండీ సీహెచ్ శ్రీధర్, మైనింగ్ డైరెక్టర్ వీ జీ వెంకటరెడ్డి, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.