స‌చివాల‌యాల‌తో సుప‌రిపాల‌న అందించాం

రెవెన్యూ శాఖామాత్యులు ధ‌ర్మాన ప్ర‌సాద‌రావు 

దేశంలోనే ఆంధ్ర‌ప్ర‌దేశ్ ఆద‌ర్శం

శ్రీ‌కాకుళం: ప్ర‌భుత్వ ల‌క్ష్యాలకు అనుగుణంగా స‌చివాల‌యాల‌తో సుప‌రిపాల‌న అందించామ‌ని రెవెన్యూ  శాఖామాత్యులు ధ‌ర్మాన ప్ర‌సాద‌రావు అన్నారు. రూ . కోటి రూపాయలతో నిర్మించిన అంపోలు -3,సత్తివాడ సచివాలయాల, రైతు భరోసా కేంద్రం నూతన భవనాలను మంత్రి ధ‌ర్మాన ప్రారంభించారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ..ఒక ప్రభుత్వ కాలంలో,మ‌న దేశంలో ఉండే ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా ఉండేలా ఆంధ్ర ప్రదేశ్  ఉంది. ఆ దిశలో స‌మున్న‌త రీతిలో జరుగుతున్న పని ఇది.

మండల కేంద్రం నుంచి, గ్రామ స్థాయికి పరిపాలన తీసుకుని వచ్చాం. అనేక సేవ‌ల‌ను అందిస్తూ క్షేత్ర స్థాయిలో సుసాధ్యం చేశాం. ఇది కేవలం 5 ఏళ్ల వైయ‌స్ఆర్‌సీపీ  ప్రభుత్వం హయాంలో జరిగిన అభివృద్ధి. ఇవాళ భూ స‌ర్వే కార‌ణంగా గ్రామాల్లో వివాదాలు తగ్గాయి. పౌరుల్లో విశ్వాసం వచ్చింది. ప్రభుత్వం అందిస్తున్న వాటిని గౌరవంగా అందుకోగ‌లుగుతున్నాం అన్న నమ్మకం ఉంది. తలెత్తుకుని ధైర్యంగా జీవించ‌గ‌లం అన్న ధైర్యం ఇవాళ సామాన్యుల‌కు వ‌చ్చింది.

మంచి పరిపాలన ఇవ్వగలం అన్న భావన సీఎం వైయ‌స్ జగన్ లో ఉంది. అందుకే ఇన్ని మంచి పనులు రాష్ట్రంలో ఈ రోజు చేయ‌గ‌లిగాం. వంశధార ప్రాజెక్ట్ పూర్తి కావొస్తోంది. రానున్న కాలంలో మూడు పంటలకు అవసరం అయిన నీరు అందిస్తాం. కృష్ణ,గోదావరి జిల్లాల మాదిరిగా మన నేల కూడా స‌స్య‌శ్యామలం అవ్వబోతుంది. 62 ల‌క్ష‌ల రూపాయ‌లతో అంపోలులో సచివాలయం, ఆర్బీకే సెంటర్స్ ప్రారంభించాం. అలానే స‌తివాడలో 40 లక్షల రూపాయ‌లతో సచివాలయం భవనం ప్రారంభించాం. ఇవ‌న్నీ సుప‌రిపాల‌న‌కు చ‌క్క‌ని ఉదాహ‌ర‌ణ‌లు. అని మంత్రి ధర్మాన తెలిపారు.

Back to Top