శ్రీకాకుళం: ఆ రోజు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు డ్వాక్రా సంఘాలకు చెందిన రుణాలను ఆసరా పథకం కింద నాలుగు విడతల్లో చెల్లించాం అని, ఇచ్చిన మాటకు కట్టుబడి మహిళలను ఆర్థికంగా భరోసా ఇస్తూనే, వారిని శక్తిమంతులను చేసేందుకు ఇవాళ తమ ప్రభుత్వం కృషి చేస్తోందని రెవెన్యూ శాఖామాత్యులు ధర్మాన ప్రసాదరావు అన్నారు. శ్రీకాకుళం నగర పాలక సంస్థ పరిధిలో ఉన్న అరసవల్లి,శ్రీకాకుళం రూరల్ మండలం, సింగుపురం,గార మండలానికి చెందిన తూలుగులో ఆసరా నాలుగో విడత నిధుల విడుదలకు సంబంధించిన కార్యక్రమాలను ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మంత్రి ధర్మాన మాట్లాడుతూ..2014 ముందు ఎన్నికల ముందు విపక్ష నేత చంద్రబాబు మీకున్న బ్యాంకు బకాయిలు చెల్లిస్తాం అని చెప్పి,మోసం చేశారు. ఆ రోజు చంద్రబాబు ఇచ్చిన మాట తప్పడంతో ఏం చేయాలో తోచక మహిళామణులు బ్యాంకు మెట్లు ఎక్కలేకపోయారు. కానీ 2019 ఎన్నికల ముందు వై.ఎస్.జగన్ చెప్పినట్లుగా మాట ఇచ్చి, నాలుగు విడతల్లో చెల్లిస్తాం అని చెప్పిన మేరకు నిధుల విడుదల చేసి రుణ విముక్తులను చేశారు. ఆనాడు వైఎస్ జగన్ పాదయాత్రలో మహిళా సంఘాలకు ఈ విషయమై స్పష్టం అయిన హామీ ఇచ్చారు. ఆ మాట ప్రకారం నాలుగో విడతగా ఇప్పుడు చెల్లిస్తున్నాం. ఫిబ్రవరి నెలలో వైయస్ఆర్ చేయూత క్రింద 18,750 రూపాయలు మహిళలకు ఇస్తాం. 45 నుంచి60 ఏళ్ల మధ్య వయస్సున్న మహిళలకు ఆర్థిక భరోసా ఈ పథకం ద్వారా కల్పిస్తాం. ఇవాళ మహిళలను ఆర్థికంగా శక్తిమంతులుగా చేసి, వారిలో దైర్యం నింపిన ప్రభుత్వం ఇది. కుటుంబాలు ఈ రోజు సంతోషంగా ఉంటున్నాయి అంటే దానికి కారణం ఈ ప్రభుత్వమే కదా.. ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలులో భాగంగా కులం,మతం, ప్రాంతం చూడం అని చెప్పాం. ఆ విధంగానే ఇచ్చిన మాట ప్రకారం అన్ని వర్గాలనూ పార్టీలకు అతీతంగా గౌరవంగా చూసి పథకాలు అందించాం. గత టీడీపీపాలన లో అందరూ బితుకు బితుకు మని జీవించేవారు. 2019 ఎన్నికల ముందే చెప్పాను. విపక్ష నేత చంద్రబాబు మాదిరి మయ మాటలు చెప్పి మోసం చేయము అని..చెప్పిన విధంగానే 4 విడతల్లో బ్యాంకులకు మీ మీ రుణాలను చెల్లిస్తాం అని చెప్పాం. నాలుగో విడత చెల్లించేందుకు ఈ రోజు మనమంతా ఇక్కడ సమావేశం అయ్యాం. మహిళా సంఘాలకే కాదు,రైతాంగానికి కూడా కుదువు పెట్టిన బంగారం విడిపిస్తాం అని చెప్పి విపక్ష నేత మోసం చేశారు. ఆ రోజు టీడీపీ సర్కారు పెద్దలు ఎన్నికల ముందు పసుపు - కుంకుమ పథకం అమలు కోసం కొంత డబ్బు వేశారు. డబ్బులు తీసుకున్నారు మహిళలు. కానీ చంద్రబాబు చేసిన మోసం గుర్తు చేసుకొని,ఆ పసుపు ఆయన మొహాన కొట్టారు.. ఓటు జగన్ కి వేసి సీఎంను చేశారు. పేద వర్గాలు ఈ రోజు ధైర్యంగా బతుకుతున్నాయి అంటే అందుకు కారణం ఈ రోజు రాష్ట్రంలో వైయస్ జగన్ ప్రభుత్వమే. చెప్పింది చెప్పిన విధంగా చేసి,అన్ని వర్గాలనూ సంతోషంగా ఉంచి,ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు వైయస్ జగన్. మళ్లీ ఎన్నికలు సమీపిస్తున్నాయి. ఈ సారి ఆయనను ఎన్నుకుంటారో .. ? మాట ఇచ్చి..మాట తప్పి..మోసం చేసి..చంద్రబాబుకు ఓటు వేస్తారో.. ? పాద యాత్రలో భాగంగా మాట ఇచ్చి,మాట నిలబెట్టుకుని,సంతోషం నింపి,మీ అందరి కడుపు నింపిన వైయస్ జగన్ మోహన్ రెడ్డికి ఓటు వేస్తారో ? ఒక్కసారి ఆలోచించండి. ఇవాళ మిమ్మల్ని కన్న బిడ్డలు కన్నా ఎక్కువ గా చూస్తున్నారు వలంటీర్లు. మళ్ళీ వైయస్ఆర్‌సీపీ ప్రభుత్వం ఏర్పాటు అయితేనే వలంటీర్లు ఉంటారు. అలానే పాలన సంబంధ నిర్ణయాల అమలులో భాగంగా వంశధార ప్రాజెక్టు దగ్గర ఎత్తిపోతల పథకాన్ని పూర్తి చేసి,నీరు అందిస్తాం. అడ్డంకులను అధిగమించి ప్రాజెక్ట్ పనులు చేపడుతున్నాం. 14 ఏళ్లు అధికారంలో విపక్ష నేత చంద్రబాబు ఉంటే.. ఏమీ చేయలేదు సరి కదా పచ్చి మోసాలు చేశారు. కానీ ఇందుకు భిన్నంగా వై.యస్.జగన్ అధికారంలోకి వచ్చిన నాలుగున్నర ఏళ్లలో ప్రజల స్థితిగతులు అనూహ్య రీతిలో మార్చారు. ఏడాదికి మూడు గ్యాస్ సిలిండర్లు ఇప్పుడు ఇస్తాం అని విపక్ష నేత చంద్రబాబు తన ఎన్నికల హామీగా చెబుతున్నారు. నాడు అధికారంలో ఉన్నప్పుడు ఏం చేశారు. ? మీ పిల్లలు ఈ రోజు ఎలాంటి స్కూల్ లో చదువు తున్నారు ? వారి చదువుకు అన్నీ సమకూర్చి,వారిని ప్రపంచం తో పోటీ పడే విధంగా చేస్తున్నదెవరు ? ఇవాళ ప్రభుత్వ బడులకు ఎన్ని మార్పులు చేశాం.? అన్నవి కూడా చూడాలి.. ఇవి కదా అభివృద్ధి..అని విపక్ష శ్రేణులను అడుగుతున్నాను. సచివాలయాల రాకతో గ్రామాల్లో పాలన మారింది. ముఖ్య ప్రభుత్వ కార్యాలయాలు ఊళ్లోనే ఉన్నాయి. సచివాలయం,రైతు భరోసా కేంద్రం,వెల్నెస్ సెంటర్ ను నిర్మించాం. ఇది అభివృద్ధి కాక ఇంకేంటి అని ప్రశ్నిస్తున్నా..? ఎన్నికల ముందు చెప్పినట్లుగా ప్రభుత్వం లోకి వచ్చాక అన్నీ చేశాం. ఇంత మందికి మంచి చేసిన జగన్ ప్రభుత్వంపై కొందరు అసత్య ప్రచారాలు చేస్తున్నారు. ఎంత మందితో ప్రభుత్వ నిధులను పంచేస్తున్నారు..పంచేస్తున్నారు అంటున్నాయి కొన్ని వర్గాలు. పంచేస్తున్నారు..పంచేస్తున్నారు ..అని అనగలరు కానీ దోచేస్తునారు అనడం లేదు కదా పేదల స్థితి,గతులు పెంచేందుకు అడ్డుపడుతున్న వారిని ఏం అనాలి.? వారికి ఓటు వేస్తే మళ్ళీ మొదటికే మోసం వస్తుంది. ఇక ధరల పెరుగుదలపై కూడా విపక్షాలు అబద్ధపు ప్రచారాలే చేస్తోంది. ఇవాళ దేశం మొత్తమ్మీద ధరలు పెరుగుతున్నాయి, మన రాష్ట్రంలో పెరిగినా కూడా మీకు తోడుగా ప్రభుత్వం ఈ రోజు ఉంది కాదా.. అని మిమ్మల్ని అడుగుతున్నాను. గ్రామాల్లో కుటుంబాలు సంతోషంగా ఉండాలి అంటే మళ్ళీ వైయస్ఆర్‌సీపీ ప్రభుత్వం ఏర్పాటు కావాలి..అని మంత్రి ధర్మాన అన్నారు. యువనేత ధర్మాన రామ్ మనోహర్ నాయుడు,మున్సిపల్ కమిషనర్ చల్లా ఒబులేశు, డీసీఎంఎస్ చైర్మన్ గొండు కృష్ణ మూర్తి, జిల్లా రైతు విభాగం అధ్యక్షులు అంబటి శ్రీనివాస్ రావు, ఎంపీపీ లు గొండు రఘురాం, అంబటి నిర్మల శ్రీనివాస్, జెడ్పీటీసీ రుప్ప దివ్య, మాజీ ఉప జెడ్పీ చైర్మన్ మార్పు ధర్మ రావు, మాజీ మున్సిపల్ చైర్మన్ మెంటాడ పద్మావతి, మండల అధ్యక్షులు చిట్టి జనార్ధన రావు, పీసా గోపి వైయస్ఆర్ సీపీ నాయకులు కోణార్క్ శ్రీనివాస్ రావు, చల్లా శ్రీనివాస్ రావు, ముంజేటి కృష్ణ, పొన్నాడ రిషి, తెలుగు రమేష్, గుండ ఆదిత్య, కోయ్యాన నగబుషణ, మార్పు పృథ్వి ,గంగు సీతాపతి, యాజ్జల గురు మూర్తి, తెలుగు రమేష్, పీసా శ్రీ హరి, అరవల రామకృష్ణ, యాల్ల నారాయణ, సుగ్గు మధు రెడ్డి, బగ్గు అప్పారావు తదితరులు పాల్గొన్నారు.