ఆర్థిక ల‌బ్ధి అందించేందుకే వైయ‌స్ఆర్‌ ఆస‌రా

 రెవెన్యూ, రిజిస్ట్రేషన్,  స్టాంపుల శాఖా మంత్రి  ధర్మాన ప్రసాదరావు
 

శ్రీ‌కాకుళం:  ఆర్థిక ల‌బ్ధి అందించేందుకు, డ్వాక్రా సంఘాలు నిల‌దొక్కుకునేందుకు, పున‌రుజ్జీవం పొందేందుకు త‌మ ప్ర‌భుత్వం మూడు విడ‌త‌ల‌లో ఇచ్చిన మాట ప్ర‌కారం సంబంధిత గ్రూపు రుణాలు తీర్చింద‌ని, మ‌రో విడ‌తలో రుణాల చెల్లింపు పూర్తి అవుతుంద‌ని,  రెవెన్యూ శాఖామాత్యులు ధ‌ర్మాన ప్ర‌సాద‌రావు అన్నారు. శ్రీకాకుళం మండలం సింగుపురంలో.. భైరి, కరజాడ, కృష్ణప్పపేట, సింగుపురం, తండెంవలస, సానివాడ గ్రామాల‌కు చెందిన ఆస‌రా ప‌థ‌కం ల‌బ్ధిదారుల‌తో స‌మావేశం ఏర్పాటు చేశారు. ఈ సంద‌ర్భంగా మంత్రి మాట్లాడుతూ.. రానున్న కాలంలో మేలు ప్ర‌భుత్వానికి మ‌ద్ద‌తు ఇవ్వ‌కుంటే మీ చేయిని మీరే న‌రుకున్న వారు అవుతారు. మీ కొంగున డబ్బు ఉంటే మీ వెంటే మొగుడు.ప్ర‌భుత్వం సహాయం చేయడం కొంద‌రికి ఇష్టం లేక ఎవడి ఇంట్లో డబ్బు  ఇస్తున్నారు..అంటూ బాధ్యత లేని మాటలు మాట్లాడుతున్నారు. కొంత మంది పార్టీ పోవాలి అని చూస్తున్నారు. ఈ పార్టీ పోతే మొదట బులెట్ మహిళలకే  తగుల్తుంది. రానున్న ఎన్నిక‌ల‌లో ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటు వేస్తే మీ చెయ్యి మీరే నరుక్కున్నట్టే..
పాద యాత్ర లో ఇచ్చిన మాట ఆసరా రూపంలో మూడు విడతాలు గా చెలించాం.చంద్రబాబు అంటారు. జగన్మోహన్ రెడ్డి  డబ్బు వృధా చేస్తున్నారు అని. చంద్రబాబు పథ‌కాలు తప్పు అని అంటున్నారు. మహిళలకు చేయూత ఇవ్వడం ఈ ప్రభుత్వం  చేసిన తప్పా.? ఆర్థిక ఆస‌రా ఇవ్వ‌డం త‌ప్పా ?  ఈ ప్ర‌భుత్వానికి వ్యతిరేకంగా ఓటు కోసం చంద్రబాబు పథ‌కాలు వేస్ట్ అంటున్నారు. ఇటువంటి వారి మాట‌ల‌ను మీరు విశ్వ‌సించ‌కండి. ప్రజలకు అండ‌గా ఉంటూ సంక్షేమ ప‌థ‌కాలు అమ‌లు చేయ‌డం వైసీపీ ప్రభుత్వం తప్పా ?  ఎవడో పోరంబోకులు చెప్పిన మాట మీరు వింటారా ?  టీడీపీ అధికారం వస్తే మీకు ఇచ్చిన పథ‌కాలు పోతాయి ? చంద్రబాబులా నేను మాట త‌ప్ప‌ను. 

రుణాల చెల్లింపుపై నేను మాట ఇచ్చాను నిల‌బ‌డ‌తాను కానీ మాట పడను అన్న‌ది వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి.. వాదం. నా తండ్రి లా అందరి ఇంట్లో నేను పోతే నా ఫోటో ఉండాలి అన్న‌ది నా చివరి కోరిక అని జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి అంటుంటారు. ఈ విధంగా ప్రజల గుండెల‌లో నిలిచిపోవాల‌న్న‌ది వైయ‌స్ జ‌గ‌న్ కోరిక. అందుకు అనుగుణంగానే ఆయ‌న పాల‌న అందిస్తున్నారు. చంద్రబాబు అధికారంలోకి వస్తే సెంటు భూమి కూడా మీకు ద‌క్క‌దు. చాలా పరిశీలన చేసిన తర్వాత ప‌థ‌కాలు ప్ర‌వేశ‌పెట్టాం. ఒక కుటుంబం ఎవరి చేతిలో బాగు పడుతుందో, సమాజంలో గౌరవం పెరుగుతుందో అన్న‌ది చూడాలి. అది ఇంట్లో ఉన్న ఇల్లాలి వల్లనే సాధ్యం. కొంతమంది మగ వాళ్ళు బాధ్యత గా ఉండరు, ఇంట్లో అవసరాలు పట్టించుకోరు, అన్ని భార్య మీద నెట్టేసి ఉంటారు. హక్కుగా భావించే కొంతమంది ఉంటారు అలాంటి వారిని ఉద్దేశించి అన్నాను. కానీ కొంద‌రు త‌న వ్యాఖ్యలు వ‌క్రీక‌రించ‌డం త‌గ‌దు.

 అలాంటి కుటుంబాలను వేగంగా అభివృద్ధి చేయాలి అని సీఎం వైయ‌స్ జగన్ మహిళలను బలవంతులు చేయాలని తలచి పథ‌కాలు వారి పేరు మీదనే ఇస్తున్నాం. మహిళలను ఆర్థికంగా బలపరిచే చర్యలు చేపట్టాం. కొంతమంది సీఎం వైయ‌స్ జగన్ చేస్తున్న మంచి నచ్చక తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు. అవేవీ మీరు ప‌ట్టించుకోకండి. నిత్యావసర సరుకుల ధరలు పెరిగాయి అంటున్నారు. ఇది త‌గ‌దు. ధ‌రల విష‌య‌మై పక్కనున్న రాష్ట్రాలతో పోల్చి చూడండి. అవి కేంద్ర పరిధిలో ఉండేవి. 

మీ చేతులకు సీఎం జగన్ శక్తిని ఇచ్చారు. అవమానాలు పడకుండా ఉండేందుకు, మీరు బ్యాంకు మెట్లు ఎక్కకుండా ఉండేలా 4  ద‌ఫాల‌లో రుణాలు చెల్లిస్తా అని చెప్పి ఇపుడు మూడో విడత అందిస్తున్నాం . చంద్రబాబు లా మాయ మాటలు చెప్పలేదు జగన్.. నడుస్తనప్పుడే చెప్పారు,ఇపుడు చేస్తున్నారు. ఇది గిట్టని వాళ్ళు జగన్ డ‌బ్బులు వృథా చేస్తున్నారు అని ప్రచారం చేస్తున్నారు.. అంటే మీ కుటుంబ గౌరవం పెంచడం తప్పా? 
అప్పులు ఊబిలో ఉండే మిమ్మ‌ల్ని బ‌య‌ట‌కు తీసుకు రావ‌డం త‌ప్పా ? మూడున్నర సంవత్సరాలుగా మీరు తీసుకుంటున్న పథ‌కాల కోసం ఒక్కరికైనా లంచం ఇచ్చారా ? లేదు కదా,  ఈ మార్పు చూసీ చంద్రబాబు గగ్గోలు పెడుతున్నారు. మీకు సహాయం చేసిన ప్రభుత్వానికి మీరంతా అండ‌గా ఉండాలి. మీ బాగోగుల కోసం ఆలోచన చేస్తున్న ప్రభుత్వం ఇది. మీ పిల్లలకి మధ్యాన్నం మంచి భోజనం అందిస్తున్నాం.  వాళ్ళు చదువుతున్న స్కూల్స్ ను నాడు నేడు తో ఎన్నో మార్పులు చేశాం. మ‌రెన్నో సౌక‌ర్యాలు అందుబాటులోకి తెచ్చాము. ధనవంతుడు పిల్లలు లానే మీ పిల్లలు కూడా మంచి చదువు చదవాలి అని భావిస్తున్నాము. ఇవ‌న్నీ డ‌బ్బులు వృథా చేసేందుకు చేసిన ప‌నులు కావు. బాధ్య‌త‌తో చేసిన ప‌నులు.అని మంత్రి ధర్మాన పేర్కొన్నారు.

మాజీ కేంద్రమంత్రి కిల్లి కృపారాణి, యువనేత ధర్మాన రామ్ మనోహర్ నాయుడు, మాజీ రాష్ట్ర మహిళా కమిషన్ చైర్మన్ త్రిపురాన వెంకటరత్నం, ఎంపిపి అంబటి నిర్మల శ్రీనివాసరావు, జడ్పిటిసి రప్పా దివ్య, ఎఎంసి ఛైర్మన్ ముకళ్ల తాత బాబు, అంబటి శ్రీనివాసరావు, ఎచ్చేర్ల సూరిబాబు,  చిట్టి జనార్ధనరావు, గోండు కృష్ణ మూర్తి, చల్లా రవి కుమార్, పొన్నాన కుర్మా రావు, గోండు ఆదిత్య, బగ్గు అప్పారావు, నక్క శంకర్, బాన్న నర్సింగరావు, గోండు కృష్ణ, గుండ మోహన్ తదితరులు పాల్గొన్నారు.

 

తాజా వీడియోలు

Back to Top