బూటకపు హామీలను నమ్మకండి

 ఎన్నిక‌ల ప్ర‌చారంలో రెవెన్యూ మంత్రి ధర్మాన ప్రసాదరావు 

చంద్రబాబు ఒక నియంత..మాట తప్పడం ఆయన నైజం

స్వలాభం చంద్రబాబుది..ప్రజాక్షేమం జగన్ ది

ఇచ్చిన మాటకు కట్టుబడి పాలన వైయ‌స్ఆర్‌సీపీ ప్రభుత్వంది.

అబద్ధాలు చెప్పం మోసం చేయం, హామీల అమలుకు నిరంతర కృషి

శ్రీ‌కాకుళం:  విపక్ష నేత చంద్రబాబు చెప్పే బూటకపు హామీలను నమ్మవద్దని రెవెన్యూ మంత్రి ధర్మాన ప్రసాద రావు పిలుపునిచ్చారు. పరదేశీపాలెం జంక్షన్ నుంచి కళ్లేపల్లి  మంత్రి ధర్మాన ప్రచార యాత్రలో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా మంత్రి ధర్మాన మాట్లాడుతూ.. గడిచిన ఐదేళ్లలో అనేక ప్రభుత్వ కార్యక్రమాల నిర్వహణలో భాగంగా మీ గ్రామానికి వచ్చాం.. ఇపుడు రానున్న ఎన్నికల్లో వైయ‌స్ఆర్ కాంగ్రెస్ తరఫున శ్రీకాకుళం అసెంబ్లీ అభ్యర్థిగా నేను,పార్లమెంట్ అభ్యర్థిగా పేరాడ తిలక్  పోటీ చేస్తున్నాం. మా ఇరువురినీ గెలిపించమని అభ్యర్థించేందుకు ఇవాళ మీ గ్రామానికి వచ్చాం. తెలుగుదేశం పార్టీ నుంచి ముఖ్య నాయకులు చేరడం శుభ పరిణామం. వారు చేరడంతో కళ్లేపల్లి గ్రామ పరిధిలో పార్టీ బల పడింది. రాష్ట్రంలో వైయ‌స్ఆర్ కాంగ్రెస్ నేతృత్వాన సాగిన పాలన చూడండి. ఐదేళ్ల ముందు మీ కుటుంబాలు ఎలా ఉండేవి ? ఇప్పుడు ఎలా ఉన్నాయి ? 
ఏ విధంగా మార్పు చెందాయి ? అన్నవి ఒక్కసారి ఆలోచన చేయండి. ఎవరో చెప్పడం ఎందుకు మీకు మీరే ఆలోచించండి. 
ఏ ప్రభుత్వం వల్లన ఈ రోజు సంతోషంగా ఉన్నామో అన్నది మీరే చెప్పండి. ఎన్నికల వేళ నాయకులందరూ చెబుతారు కానీ ఎన్నికలు అయ్యాక ఆ మాట మీద ఎవరు ఉన్నారో ఆలోచించండి. ఇచ్చిన హామీల అమలుకు ఎవరు కృషి చేశారో ఆలోచించండి.

టీడీపీ యువనేత లోకేశ్ పరిశ్రమలు తెస్తాం..20 లక్షలు ఉద్యోగాలు ఇస్తాం అంటున్నారు. 14 ఏళ్లు మీ నాన్న సీఎంగా ఉన్నారు. 20 కాదు 2 లక్షల ఉద్యోగాలు అయినా ఇచ్చారా ? మా హయాంలో 2.5 లక్షల సచివాలయ ఉద్యోగాలు ఇచ్చాం. వైద్యరంగంలో 58 వేల ఉద్యోగాలు భర్తీ చేశాం. మరి ఆ రోజు చంద్రబాబు నాయుడు అధికారంలో ఉన్నపుడు ఏం చేశారు.? మన జిల్లా టీడీపీ నాయకులకు మన శ్రీకాకుళం కోసం ఏం చేశారో చెప్పే దమ్ము ఉందా..? ఎన్నికలు వచ్చిన ప్రతిసారీ చంద్రబాబు అబద్ధపు హామీలతో వస్తారు. ధనవంతులకు కొమ్ము కాసే నైజం చంద్రబాబుది.

అమరావతి రాజధాని పేరిట యాభై రెండు వేల ఎకరాలు సేకరించి, వాటితో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయాలనుకున్నారు. కేంద్రం నియమించిన కమిటీ సిఫారసులను సైతం పట్టించుకోకుండా వాటినన్నింటినీ బుట్ట దాఖలు చేసి,రాజధానిగా కృష్ణా - గుంటూరు జిల్లాల మధ్య అమరావతిని ఎంచుకున్నారు. స్వలాభం కోసం అయిన వారి ప్రయోజనాల కోసం ఎంచుకున్నారు. తరువాత అసలు గుట్టుకాస్త రట్టయింది. ఆ రోజు సింగపూర్ సర్కార్ తో ఒప్పందం అని అబద్ధాలు చెప్పారు. జీ టు జీ ఒప్పందాలు  అని చెప్పి ప్రజలను మోసం చేశారు.

 వలంటీర్లను ఉద్దేశించి అనేక సందర్భాల్లో దొంగలూ,రౌడీలూ అన్నారు. మహిళల అక్రమ రవాణాకు సహకరిస్తున్నారు అని లేనిపోని ఆరోపణలేవో చేశారు. గోనె సంచులు మోసుకునే ఉద్యోగం అని చంద్రబాబు హేళన చేశారు. కానీ ఇప్పుడు వలంటీరు వ్యవస్థను ఉంచుతాం తీసెయ్యం అని అంటున్నారు. వారికి పది వేల రూపాయల పారితోషకం ఇస్తామని అంటున్నారు. అప్పుడొక మాట,ఇప్పుడొక మాట. ఎన్నికల వేళ చెప్పే ఏ మాటనూ తరువాత కాలంలో అధికారంలోకి వచ్చాక చంద్రబాబు నిలుపుకున్న, అమలు చేసిన దాఖలాలు లేనే లేవు. ఇంట్లో ఎవరికి ఏం ఇవ్వాలన్నా జన్మ భూమి కమిటీలకు దగ్గరకు రావాల్సిందే అని చెబుతున్నారు. బరి తెగించి మాట్లాడుతున్న వారికి అధికారం ఇస్తామా ? కానీ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో ఇందుకు భిన్నంగా మీరంతా ఈ ఐదేళ్లలో ఎంతో ఆత్మగౌరవంతో బతికారు. ఎవ్వరి దగ్గరా చేయి చాపకుండా బతికారు. పథకాల అమలులో మధ్యవర్తుల ప్రమేయం అన్నది లేనే లేదు. 

మన శ్రీకాకుళం నియోజకవర్గంలో 20 వేల మందికి ఇళ్ళ పట్టాలు ఇచ్చాం. ఆ భూమి కొనుగోలు చేసేందుకు రూ.500 కోట్లు ఖర్చు చేశాం. అంతేకాదు వాటికి మౌలిక సదుపాయాలు కల్పించాం. అలానే పేదలకు నిలువ నీడ కల్పించాలన్న సదుద్దేశంతో ఇళ్లు కాదు ఊళ్లు నిర్మించాం. చంద్రబాబు ఇప్పుడున్న ధరలను కొనసాగిస్తాం అని అంటున్నారే కానీ రేపటి వేళ ఒకవేళ అధికారంలోకి వస్తే ఎక్కడా తగ్గిస్తాం అని చెబుతున్నారా ? అని ప్రశ్నిస్తున్నాను. మన రాష్ట్రం కన్నా ఏ రాష్ట్రంలో నిత్యావసర సరకుల ధరలు తక్కువ ఉన్నాయో చెప్పండి. అధికారం కోసం పచ్చి అబద్ధాలు ఆడుతారు చంద్రబాబు. తీరా అధికారంలోకి వచ్చాక ప్రజలను నిలువునా ముంచుతారు చంద్రబాబు. కానీ మన ప్రియతమ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి తీరు ఇందుకు భిన్నంగా ఉంటుంది. ప్రజాధనం అన్నది అర్హులు అయిన పేదలకు చేరాలన్నదే ఆయన సంకల్పం.

ఇవాళ ప్రతి మహిళనూ ఆర్థికంగా శక్తిమంతులుగా చేశాం. ప్రతి గ్రామం అభివృద్ధి చేశాం. స్కూల్స్, హాస్పిటల్స్, విలేజ్ సెక్రటేరియట్స్,ఆర్బీకే  సెంటర్స్,వెల్నెస్ సెంటర్స్ ఇలా అన్నింటికీ శాశ్వత భవనాలు నిర్మించాం. ఇవి అభివృద్ధి కాదా..? 

ధనిక,పేద అన్న తేడా లేకుండా అందరికీ ఒకే విధం అయిన విద్య అందించాలి అని ఈ ప్రభుత్వం సంకల్పించింది. విద్యావ్యవస్థలో సమూల మార్పులు చేసింది. బుక్స్,బెల్ట్,షూస్,యూనిఫాంతో పాటు మంచి పోషకాహారం అందించాం. పిల్లలను బడికి పంపే తల్లులకు ఆర్థికంగా భారం కాకుండా ఉండేందుకు అమ్మ ఒడి పథకంలో భాగంగా ప్రతి తల్లికీ వారి అకౌంట్లో ఏడాదికి పదిహేను రూపాయలు చొప్పున జమ చేసి,వారికి భరోసా ఇచ్చాం.

ఇవాళ 4 వేల కోట్ల రూపాయలతో మూలపేట పోర్టు పనులు జరుగుతున్నా యి. మరో నాలుగు నెలల్లో  బెర్త్ పూర్తి అవుతోంది. ప్రపంచంతో శ్రీకాకుళం తీరానికి బంధం ఏర్పడుతుంది. తద్వారా ఉద్యోగ,ఉపాధి అవకాశాలు వస్తాయి. హిరమండలం గొట్టా బ్యారేజీ దగ్గర లిఫ్ట్ ఏర్పాటు చేశాము. 19టీఎంసీల నీటిని సద్వినియోగం చేసుకునే విధంగా గొట్టా బ్యారేజీ వద్ద ఎత్తిపోతల పథకానికి రూప కల్పన చేశాం. రానున్న వర్ష కాలంలో నీరు నిల్వ చేయనున్నాం.  వంశధార నీటిని మండు వేసవిలోనూ అందించనున్నాం.

 ప్రజలు ఇచ్చిన అధికారాన్ని వారి జీవన స్థితిగతులు మెరుగు పరిచేందుకు వినియోగించాం. 

కళ్ళేపల్లి రోడ్డు విస్తరణ చేస్తాం. ఇందుకు సంబంధించిన ప్రతిపాదన కేంద్రానికి పంపాం. మీరు మా ర్పును గమనించండి. పాలన సంస్కరణలు గమనించండి. వాటి కారణంగా వచ్చిన ఫలితాలను గుర్తించండి. మీకు మేలు చేసే ప్ర భుత్వానికి మరోసారి మద్దతు ఇవ్వండి..

 పలువురు టీడీపీ నేతలు మంత్రి ధర్మాన సమక్షంలో వైయ‌స్ఆర్‌సీపీలో చేరారు. మూకళ్ళ నీలం,మూకళ్ళ రాము తో పాటు పరదేశీపాలెం గ్రామానికి చెందిన 30 మంది యువకులు వైయ‌స్ఆర్‌సీపీ లో చేరారు. వారికి మంత్రి ధర్మాన సాదర స్వాగతం పలికారు.

Back to Top