ఐదేళ్ల వైయ‌స్ జ‌గ‌న్ పాల‌న అపూర్వం 

రెవెన్యూ మంత్రి ధ‌ర్మాన ప్ర‌సాద‌రావు 

14 ఏళ్ల చంద్ర‌బాబు పాల‌న‌కు చేత‌గానిది..జ‌గ‌న్ వ‌ల్ల సాధ్యం అయింది ఇదే

భారీ మెజార్టీతో గెల‌వ‌బోతున్నాం 

వైయ‌స్ జగన్ దగ్గర చంద్రబాబు నాటకాలు సాగవు..

గౌర‌వంగా ప్ర‌జ‌లు ప‌థ‌కాలు అందుకున్నారు

చంద్రబాబు ఎజెండా దోచుకోవడం, వైయ‌స్ జగన్ ఎజెండా ప్రజలకు మంచి చేయడం. 

బ‌ల‌గ,ఆదివారంపేట ప్రచారం

మా పాలనలో చోటుచేసుకున్న మార్పులు గమనించండి

శ్రీ‌కాకుళం  : ఐదేళ్ల వైయ‌స్ జ‌గ‌న్ పాల‌న అపూర్వం అని రెవెన్యూ మంత్రి ధ‌ర్మాన ప్ర‌సాద‌రావు అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా మొద‌టి రోజు (సోమ‌వారం) బ‌ల‌గ, ఆదివారం పేట‌లో ప్ర‌చార స‌భ నిర్వ‌హించారు. తొలుత అర‌స‌వ‌ల్లి దేవాల‌యాన పూజ‌లు చేశాక, అక్క‌డ స్థానిక నాయ‌క‌త్వంతో క‌లిసి ప్ర‌చారం సాగించారు. అనంత‌రం బ‌ల‌గ‌కు చేరుకుని ఇక్క‌డ 
ఏర్పాటు చేసిన స‌భ‌లో ప్ర‌సంగించారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ...యుద్ధానికి సిద్ధం అవుతున్నాం. వైయ‌స్ జగన్ మోహన్ రెడ్డి నాయకత్వం వర్థిల్లాలి. వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ వర్థిల్లాలి..మన గుర్తు ఫ్యాన్.. మన నోటితో చెప్పకుండా సైగ తో చెప్పే గుర్తు ఫ్యాన్ గుర్తు. ప్రచారం ఇక్కడి నుంచి ప్రారంభించడం ఆనందంగా ఉంది. 

ఆదివారం పేట ప్రజలు ఎప్పుడు నాకు మెజారిటీ ఇస్తూనే ఉన్నారు. పార్టీ అధికారంలోకి వ‌చ్చిన రోజు నుంచి ఇప్ప‌టి వ‌ర‌కూ ప్రజల మధ్యనే ఉన్నాం. మన రాష్ట్రం లో దొంగ మీడియా ఉంది. వక్రీకరించి వార్తలు వేయడమే వారి పని..14 ఏళ్ల పాటు దోపిడీ పాల‌న సాగించిన పార్టీ ఒకవైపు..5 ఏళ్లు సుపరిపాలన చేసిన పార్టీ ఇంకొక వైపు.. మా పాలన లో జరిగిన మార్పులు గమనించండి అంటూ మంత్రి కోరారు.

ఉత్త‌రాంధ్ర అభివృద్ధి అంతా చంద్ర‌బాబే ఇదంతా చేశారా ? 
అలా చెప్పుకుంటే జ‌నం న‌మ్ముతారా ? న‌మ్మి ఓటేస్తారా ? 
14 ఏళ్ల పాటు పాలించిన చంద్రబాబు జిల్లాకు ఏం ఇచ్చారో చెప్ప‌గ‌ల‌రా ? ఒక్క ప్ర‌భుత్వ సంబంధిత ప‌ని ఉందా ? ప్ర‌భుత్వ ఆస్తుల నిర్మాణం ఒక్క‌టైనా చేశారా ? ఆ రోజు వైయ‌స్ఆర్‌ హ‌యాంలో రాజీవ్ గాంధీ మెడిక‌ల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ సైన్స్ (రిమ్స్)ను,బీఆర్ అంబేద్క‌ర్ యూనివ‌ర్శిటీనీ,వంశ‌ధార ప్రాజెక్టును ఇచ్చారు. అటుపై ఆయ‌న త‌న‌యుడు వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి మూలపేట పోర్టు తీసుకుని వ‌చ్చారు. ఉద్దానం వాటర్ స్కీమ్ ను ఏర్పాటు చేశారు. స‌ర్ఫేస్ వాట‌ర్ ఇచ్చారు. ఏడు వంద‌ల కోట్ల రూపాయ‌ల‌ను వెచ్చించారు. బుడ‌గుట్లపాలెం ఫిషింగ్ హార్బర్..కు నిధులు కేటాయించి ప‌నులు చేయిస్తున్నారు. అంతేకాకుండా గ్రామ,గ్రామాన సచివాలయ భ‌వ‌నాలు నిర్మించారు. ఇవ‌న్నీ నేను చేశాను..మీరు చేయలేదు అంటే ప్ర‌జ‌లు న‌మ్ముతారా ? అలా అయితే,అలా చెప్పుకుంటే చంద్రబాబు అభివృద్ధి చేసిన‌వార‌వుతారా ?"

ఇప్పటికైనా చంద్రబాబు క‌ళ్లు తెర‌వాలి 
ఇటీవ‌ల కేంద్రం ప్రకటించిన సూచీల్లో..టీడీపీపాలనలో జీఎస్డీపీ 22 వ స్థానంలో ఉంటే, వైయ‌స్ఆర్‌సీపీ ప్రభుత్వంలో 5 వ స్థానంలో ఉంది. డెవ‌ల‌ప్మెంట్ ఛాంపియ‌న్ చంద్ర‌బాబూ ..ఇదే నా మీ అభివృద్ధి ?  అని ప్ర‌శ్నిస్తున్నాను. మ‌న రాష్ట్ర తలసరి ఆదాయం.. చంద్ర‌బాబు ఉన్న‌ప్పుడు 17 వ స్థానంలో ఉంటే ఇప్పుడు 9 వ స్థానానికి వచ్చాం. 14 ఏళ్ల పాల‌న‌లో చంద్రబాబు ఏం ఇరగదీశారో మరి..  చంద్ర‌బాబు నేతృత్వాన అన్ని విధాల అన్ని రంగాల్లో నాశ‌నం అయిన రాష్ట్రాన్ని వైయ‌స్‌ జ‌గ‌న్ బాగు చేశారు. ఈటీవీ ,ఏబీఎన్ కి వ్యక్తిగత స్వార్థం ఉంది. అందుకే ఈ ప్రభుత్వం మీద బురద జల్లే వార్తలు వేస్తారు. ఈజీ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో 3 వ ర్యాంక్ వ‌చ్చింది. తెలిసీ,తెలియని మాటలతో చంద్రబాబు మాయ చేయాలి అని చూస్తున్నారు. ప్రజల స్థితిగ‌తులు పెంచేందుకు కృషి చేశాం. విజయం సాధించాం. ఇప్పటికైనా చంద్రబాబు క‌ళ్లు తెర‌వాలి. వీట‌న్నింటినీ గుర్తించాలి అని సూచిస్తున్నాను.

అర్హ‌తే ప్రామాణికంగా ప‌థ‌కాలు అందించాం
ఆ రోజు చంద్ర‌బాబు పాలనలో పేద ప్రజలు ప్ర‌భుత్వం అందించే విద్య,వైద్యంకు దూరం అయ్యారు. వారి అవసరాలు తీర్చ‌డ‌మే అసలైన పాలన. మా ప్రభుత్వ పాల‌న‌లో 31 లక్షల మందికి ఇళ్ళ పట్టాలు ఇచ్చాం. 75 ఏళ్ల స్వతంత్ర దేశంలో మేము కూడా మా తాతలూ,తండ్రులూలానే సొంత ఇల్లు లేకుండా ఉంటామాఅని బాధపడే వారికి అండ‌గా నిలిచాం. ప్రభుత్వ పథకాలు సగౌరవంగా అందుకునేలా చేశాం. సంక్షేమ ప‌థ‌కాల‌నూ స‌గౌర‌వంగా అందుకునేలా చేశాం. ఇందుకు ప్ర‌త్యేక వ్య‌వ‌స్థ‌ను ఏర్పాటు చేశాం. వలం టీర్లు, స‌చివాల‌య ఉద్యోగుల స‌మ‌న్వ‌యంతో అర్హ‌తే ప్రామాణికంగా ప‌థ‌కాలు అందించాం.

పింఛ‌న్లు ఆపించింది చంద్ర‌బాబే.. 
డిగ్నిటీ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ దేన్ వెల్త్. ఈరోజు ఎక్కడికి వెళ్ళినా ఎవరికి అడిగినా తెలుస్తుంది. ఎంత గౌరవంగా పథకాలు అందుకున్నారు అన్న‌ది తెలుస్తుంది. ప్రభుత్వం,ప్రజలు అందరూ రాజ్యాంగం అనుసారం బ‌తుకుతార‌ని నమ్మాము. కానీ ఆ రోజు చంద్రబాబు ఆ విధంగా కాదు. చంద్రబాబు ఎజెండా దోచుకోవడం, వైయ‌స్ జగన్ ఎజెండా ప్రజలకు మంచి చేయడం. ఆ రోజు రాజ‌ధాని అమరావతి పేరుతో దోచుకుతిన్నారు. సింగ‌పూర్ ప్ర‌భుత్వంతో ఒప్పందాలు అని పేర్కొని గ‌వ‌ర్న‌మెంట్ టు గ‌వ‌ర్న‌మెంట్ (జీ టు జీ)అని మోసం చేశారు. ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా 70 లక్షల మందికి ఈ రాష్ట్రంలో గౌరవంగా పెన్షన్ ఇస్తున్నాం. పింఛ‌న్లు వలంటీర్లతో పంపిణీ చేయించ‌నివ్వ‌వ‌ద్ద‌ని అభ్యంత‌రాలు చెబుతూ చంద్రబాబు నేతృత్వాన కోర్టులో పిటిషిన్ పెట్టారు. ఈ రోజు పెన్షన్ ఆగడానికి చంద్రబాబు కారణం అని సంబంధిత ల‌బ్ధిదారులందరికీ తెలిస్తే టీడీపీ కార్యకర్తలను వెంట‌బెట్టి కొడ‌తారు. కొట్టి త‌రుముతారు. చంద్రబాబుకు ఎన్నికలు దొంద తప్ప.. ప్రజలకు మంచి చేసే ఆలోచన లేదు.. మ‌నంద‌రి స్థితి గతులు పెంచిన ప్రభుత్వం ఇది 

వైయ‌స్ జగన్ దగ్గర చంద్రబాబు నాటకాలు సాగవు..మ‌న ఊరి స్థితిగ‌తులు,మ‌నంద‌రి స్థితి గతులు పెంచిన ప్రభుత్వం ఇది. జీవన ప్రమా ణాలు పెంచిన ప్రభుత్వానికి తోడుగా ఉండాలి అని ప్రజలు అందరు ఎప్పుడో నిర్ణయం తీసుకున్నారు. గతంలో ఎన్నికల కంటే ఎ క్కువ మెజారిటీ నాకు రాబోతుంది..5 ఏళ్లలో ఏ తప్పూ చేయలేదు. దేశంలో ఉండే ఇతర రాష్ట్రాలకు ఏపీ ఆదర్శంగా ఉంది.ఇం దుకు కారణం జ‌గ‌న్ అందించిన సుప‌రిపాల‌న. ఈ విష‌యం గౌర‌వ రాజ‌కీయ పార్టీ కార్య‌క‌ర్తంతా ప్రజల అందరికీ తెలియజేయండి అని కోరుతున్నాను. పేరాడ తిలక్..నా ముఖ్య అనుచరుడు. ఆయ‌న‌ను వైయ‌స్ఆర్‌సీపీ త‌ర‌ఫున శ్రీ‌కాకుళం పార్ల‌మెంట్ నియోజ‌క వ‌ర్గ అభ్యర్థిగా మా పార్టీ అధినేత వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్‌ రెడ్డి నియమించారు. ఆయనను అత్య‌ధిక మెజారిటీతో గెలిపించాలని మీ అందరినీ కోరుకుంటున్నాను. అని మంత్రి ధర్మాన పేర్కొన్నారు.

కార్య‌క్ర‌మంలో వైయ‌స్ఆర్‌సీపీఎంపి అభ్యర్ధి పెరాడ తిలక్,  స్థానిక నాయకులు సాధు వైకుంఠ రావు, బలగ గణపతి పట్నాయక్,  పంకు ప్రసాద్, కింజరాపు రామారావు, యాడ్ల జానకి రావు, వరుదు విజయ్ కుమార్, మెరక సూర్య నారాయణ, మంగు వేద వల్లి తదితరులు పాల్గొన్నారు.

Back to Top