శ్రీకాకుళం: పేదల ఇంటి కలను ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి సాకారం చేశారని రెవెన్యూ మంత్రి ధర్మాన ప్రసాదరావు అన్నారు. పాత్రుని వలస టిడ్కో ఇల్లు పంపిణీ లో పాల్గొన్న మంత్రులు ధర్మాన ప్రసాదరావు, ఆదిమూలపు సురేష్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి ధర్మాన ప్రసాదరావు మాట్లాడుతూ.. ఇళ్లు పొందుతున్నవేళ శుభాకాంక్షలు. ఇల్లు పొందడం అన్నది చిన్న విషయం కాదు. మా జిల్లా నుంచి దేశంలో ఏ పేద పట్టణానికి వెళ్లినా మా వాళ్లే ఉంటారు. తాపీ పని చేసేవారు,హోటళ్లలో పనిచేసేవారు, తినుబండారాలు అమ్మేవారు కనిపిస్తారు. ఎక్కడెక్కడో రోడ్డు మీద వారంతా జీవిస్తూ ఉంటారు. అది ఒక రకం. ఇక రెండో రకం. గ్రామీణ ప్రాంతాల నుంచి శ్రీకాకుళం పట్టణానికి వచ్చేవారు. ఇక్కడ లబ్ధిదారులుగా ఉన్న 1200 మందిలో దాదాపు తొంభై శాతం వారు ఈ శ్రీకాకుళం పట్టణానికి చెందిన వారు కారు. బయట ప్రాంతాలకు చెందిన వారు. ఇల్లు లేక చిన్న చిన్న ఆవాసాల్లో జీవించిన వారు. అలాంటి జీవన పరిస్థితులు వీరివి. దీనికి భూమి నేను మంత్రిగా ఉన్నప్పుడు కొనుగోలు చేశాను. ఆ రోజు పాత్రునివలస గ్రామస్థులు భూమి ఇవ్వం అని చెప్పారు. ఎందుకంటే టౌన్ పక్కన ఉన్న భూమిని ఇచ్చేందుకు ఎవ్వరూ ఇష్టపడరు. ల్యాండ్ వాల్యూ అంతకంతకూ పెరుగుతూ వస్తుంది కనుక వారంతా ఒకప్పుడు భూమి ఇచ్చేందుకు టిడ్కో ఇళ్ల నిర్మాణానికి అడ్డు చెప్పారు. ఎకరం నాలుగు నుంచి ఐదు కోట్ల రూపాయల ఖరీదు ఉంటుంది. అందుకే వారు ఇవ్వమని చెప్పారు. లబ్ధిదారుల సమస్యలను అర్థం చేసుకుని భూమి ఇవ్వాలని నేను కోరగా ఆ రోజు భూమి ఇచ్చేందుకు అంగీకారం చెప్పారు. ఇంత అందంగా నగరంగా రూపొందడానికి కారణం రైతులు. వారికి చేతులు ఎత్తి మొక్కుతున్నాను. విపక్ష నేత చంద్రబాబు అధికారంలో ఉండగా ఈ పట్టణంలో ఒక్క రూపాయి ఇచ్చి అయినా బీదలకు ఇళ్లు ఇచ్చేందుకు వెచ్చించారా అని ప్రశ్నిస్తున్నాను. పైగా పేదల కోసం కేటాయించిన స్థలాన్ని తెలుగుదేశం పార్టీ ఆఫీసు నిర్మాణం కోసం ఆయన లాక్కున్నారు. అదే జగన్ మోహన్ రెడ్డి పదహారు వేల మందికి ఐదు వందల కోట్ల రూపాయలు వెచ్చించాం. సుఖంగా కుటుంబం జీవించేందుకు సౌకర్యాలు కల్పించిన నాయకుడు జగన్మోహన్ రెడ్డి. ప్రజాస్వామ్య ప్రభుత్వాలు చేసింది చేసిన విధంగా గ్రహించకపోతే తరువాత వచ్చిన వారు ఆ పని చేసేందుకు ఇష్టపడరు. 15 సంవత్సరాల ముఖ్యమంత్రి హోదాలో ఒక్క ఎకరం భూమి అయినా పేదల కోసం ఇళ్ల నిర్మాణానికి భూమి కొన్నారా ? ఇవాళ పట్టణంలో పదిహేను వేల మందికి ఇల్లు ఇచ్చాం. ఆ రోజు జన్మభూమి కమిటీలో డబ్బులు ఇచ్చి ఇల్లు పొందిన వారు ఉన్నారు. ఒకవేళ ఎవ్వరైనా ఇచ్చి ఉంటే నేను వెంటనే అరెస్టు చేయిస్తాం. మా ప్రభుత్వ హయాంలో రెండు లక్షల ఏడు వేల కోట్ల రూపాయలు పంచాం. ఇందుకోసం లంచం ఇచ్చారా ? ఇల్లు ఇవ్వడానికి పేరు రాయడానికి డబ్బు పుచ్చుకుంటే ఊరుకుంటానా ? ఒప్పుకోను గాక ఒప్పుకోను. లంచాలు తీసుకున్నారు అని తెలిస్తే వెంటనే అరెస్టు చేయిస్తాం. అభివృద్ధిలో గత ప్రభుత్వానికీ ఈ ప్రభుత్వానికీ ఎంతో తేడా ఉంది. అందుకే ఆయన బీదల విషయమై ఎంతో శ్రద్ధ వహిస్తారు. ఇల్లు ఇస్తే జీవితాంతం సంతోషంగా ఉండాలని కోరుకుంటారు. ఆయనను ఉద్దేశించి అనుచిత వ్యాఖ్యలు చేయడం తప్పు. ఇవాళ మీరంతా సంతోషంగా ఉండేందుకు కారణం జగన్మోహన్ రెడ్డి. ఆయన్ను అభినందించేందుకు కూడా మనలో కొందరికి మనసు రావడం లేదు. మీరు అసత్య ప్రచారాలు నమ్మవద్దు. పేపర్లూ, మీడియా చూసి మీరు ఓ తప్పుడు అభిప్రాయానికి రావొద్దు. ఇంట్లో ఉండి విమర్శలు చేయడం తగదు. ప్రతి నెలా అమలు అవుతున్న పథకాలు వాటి ద్వారా అందించే డబ్బు ఎక్కడిది.. ఇది కూడా మీరు తెలుసుకోవాలి. ఈ ఇళ్ల నిర్మాణాల పూర్తికి మౌలిక వసతుల కల్పనకు టిడ్కో ఛైర్మన్ ప్రసన్న చాలా కష్టపడ్డారు. ఆయన ఇక్కడికి వచ్చిన ప్రతిసారీ నాతో భేటీ అయి ఇక్కడి పనుల స్టాటస్ నాకు ఎప్పటికప్పుడు వివరించి వెళ్లేవారు. ఆ విధంగా నా సూచన మేరకు అన్ని వసతలూ పూర్తి చేసి ఇళ్ల నిర్మాణం పూర్తి చేసి ఇచ్చారు. వారికి నా అభినందనలు. మంత్రి ఆదిమూలపు సురేశ్ బాగా చదువుకున్న వారు. ఆయన ఇండియన్ రెవెన్యూ సర్వీసెస్ నుంచి ప్రజా జీవితంలోకి వచ్చిన వారు. ముఖ్యమంత్రి దగ్గర మంచి పేరు తెచ్చుకున్న మంత్రులలో ఒకరు. నాకెంతో ఆయన సన్నిహితులు. ఆయన ఏ బాధ్యత నిర్వర్తించినా పూర్తిగా శ్రద్ధ వహించి పనిచేస్తారు. రాజకీయ రంగంలో ఆయన ఇంకా ఎదగాలని కోరుకుంటున్నాను. వారికి నా కృతజ్ఞతలు. ఇక కలెక్టర్ కూడా ఇక్కడ ప్రత్యేకాధికారిగా ఉంటూ పనులను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ ఉన్నారు. అలానే 24 గంటలూ విద్యుత్ సరఫరాకు కృషి చేయండి అని కలెక్టర్ ను కోరుతున్నాను. పాతృని వలసతో పాటే చాపురం గ్రామ ప్రజలు కూడా వీరిని కలుపుకోండి. వారి కష్ట సుఖాలను వారితో కలిపి పంచుకోండి. గ్రామస్థులంతా కలిసి వీరితో గడపండి. వందల కోట్ల ఖర్చు చేసిన నిర్మాణాలను కాపాడడం మీ బాధ్యత. ఎవరో వచ్చి చేస్తారన్న భావన నుంచి మీరు బయటపడండి. ఈ రోజు శ్రీకాకుళం పట్టణాన్ని చూడండి. ఎంత క్లీన్ గా ఉందో..నాలుగైదు వందల మంది కష్టాన్ని గుర్తించండి. అలానే పరిసరాల పరిశుభ్రతకు ఇక్కడ కూడా కృషి చేయండి. అలానే కొత్త గ్రామాలకు తాగునీరు అందించనున్నాం. పొన్నాడ రాగోలు లింగాల వలస గ్రామాల్లో ఇళ్ల నిర్మాణాలు అవుతున్నాయి. ఇళ్ల నిర్మాణంలో మనం మూడో స్థానంలో ఉన్నాం. జగన్ వచ్చాక ఇళ్ల నిర్మాణం వేగం పుంజుకుంది. అన్ని సదుపాయాలతో ఇళ్ల నిర్మాణం పూర్తి చేస్తూ ఉన్నాం. ధనవంతులు కట్టిన పన్నుల నుంచి ఇవన్నీ మనం చేస్తూ ఉన్నాం. వీటిని కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిదీ, నాలుగేళ్లలో ఎన్నడూ లేని విధంగా అభివృద్ధి. డే అండ్ నైట్ నుంచి ఆమదాలవలస స్టేషన్ వరకూ రోడ్డు పనులకు సాంక్షన్ ఇచ్చాం. చేస్తున్నాం. వేసవిలో వంశధార నీరు ఈ పట్టణం మీదుగా పోతోంది. పెద్ద పాడు చెరువు నీటితో నిండిపోయింది. అలానే వేసవిలో మిగతా ప్రాంతాలకూ వంశధార నీరు అందించే విధంగా చర్యలు. మార్కెట్ చూడండి, ఆస్పత్రి చూడండి. అలానే మిగిలిన ప్రాంతాలు చూడండి ఏ విధంగా అభివృద్ధి చెందాయో , ఆరు అర్బన్ ఆస్పత్రుల అభివృద్ధికి కృషి చేశాం. అందుకోసం రాజకీయాలు వేరు ప్రజలకు సంబంధించిన అభివృద్ధి వేరు. మేం నిష్పక్షపాతంగా పనిచేస్తున్నాం. జన్మభూమి కమిటీల వారు పేర్లు రాయించు కున్నారు. కానీ నేను నిష్పక్షపాతంగా లాటరీ వేసి ఇళ్లు కేటాయించాం. ఇల్లు కోసం మీరు ఎవ్వరికైనా డబ్బు ఇచ్చారా ? పన్నెండు వేల ఇళ్లు కడుతున్నాం. ఎవ్వరికైనా మీరు వీటి కోసం డబ్బు ఇచ్చారా ? మేం ఇప్పుడు కట్టిన ఇళ్లకు డబ్బులు తీసుకోలేదు. ఏ పార్టీ అన్నది చూడలేదు. ఏ జెండా అన్నది చూడలేదు. అయినా ఇళ్లను కేటాయించాం. పథకాలు అందించాం. ఇన్ని చేసినా జగన్ ను ఉద్దేశించి అనుచిత వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు ఆలచనలు ఉన్నతంగా ఉండాలి. ఆదర్శంగా ఉండాలి. మీ ఆలోచనలు తప్పుగా ఉండకూడదు. ఓటు అన్నది మీ ఇష్టం. అని మంత్రి ధర్మాన పేర్కొన్నారు. మున్సిపల్ కమిషనర్ చల్లా ఓబులేసు అధ్యక్షత వహించిన కార్యక్రమంలో కలెక్టర్ శ్రీకేష్ బి లత్కర్, టిడ్కో ఎండీ చిత్తూరి శ్రీధర్, చైర్మన్ ప్రసన్న కుమార్, ఇతర కార్పొరేషన్ ఛైర్మన్ మామిడి శ్రీకాంత్, అందవరపు, సూరిబాబు, మాజీ మున్సిపల్ చైర్ పర్సన్స్ మెంటాడ పద్మావతి, పైడి శెట్టి జయంతి తదితరులు పాల్గొన్నారు.