తిరుపతి: ఇండో–పాక్ యుద్ధంలో విశేష సేవలు అందించిన ఆర్మీ రిటైర్డ్ మేజర్ జనరల్ సి.వేణుగోపాల్‌ను ముఖ్యమంత్రి వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి ఘనంగా సత్కరించారు. తిరుపతిలోని చెన్నారెడ్డి హౌసింగ్ కాలనీలో ఉండే రిటైర్డ్ మేజర్ జనరల్ వేణుగోపాల్ నివాసానికి సీఎం వైయస్ జగన్ చేరుకున్న సీఎం వైయస్ జగన్.. ఆయన్ను ఆప్యాయంగా పలకరించి.. యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం యుద్ధవీరుడు వేణుగోపాల్‌ను సీఎం ఘనంగా సన్మానించారు. అనంతరం వేణుగోపాల్, వారి కుటుంబ సభ్యులతో ముచ్చటించారు. 1971లో జరిగిన ఇండో–పాక్ యుద్ధంలో వేణుగోపాల్ పాల్గొన్నారు. ముఖ్యమంత్రి వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి కాసేపట్లో తిరుపతి పోలీస్ పరేడ్ గ్రౌండ్‌కు చేరుకోనున్నారు. పరేడ్ గ్రౌండ్‌లో నిర్వహించే స్వర్నిమ్ విజయ్ వర్ష్ కార్యక్రమానికి హాజరై... సభను ఉద్దేశించిన సీఎం ప్రసంగించనున్నారు.