ఏపీ ప్లానింగ్‌ బోర్డు ఉపాధ్యక్షుడిగా మల్లాది విష్ణు బాధ్య‌త‌లు

విజ‌య‌వాడ‌: ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడిగా మల్లాది విష్ణు శుక్ర‌వారం ప‌ద‌వీ బాధ్య‌త‌లు చేప‌ట్టారు.  ఈ మేరకు ప‌లువురు వైయ‌స్ఆర్‌సీపీ నేత‌లు మ‌ల్లాది విష్ణును అభినందించారు. ఎస్సీ క‌మిష‌న్ స‌భ్యులు కాలే పుల్లారావు,  వైయ‌స్ఆర్‌సీపీ విజ‌య‌వాడ‌ నగర అధ్యక్షుడు బొప్పన భవకుమార్, నాయకులు కేవీ రమ‌ణారావు, మ‌దిరి ప్ర‌భాక‌ర్‌, లేళ్ల‌పూడి లాజ‌ర్‌,వేగే వాణి ప్రసాద్, పొట్లూరి రవి, కమ్మిలి రంగా, సుంకర చినబాబు తదితరులు  విష్ణుకు శుభాకాంక్షలు తెలిపారు. మల్లాది విష్ణు ప్రస్తుతం విజయవాడ సెంట్రల్‌​ ఎమ్మెల్యేగా ఉన్నారు.  రెండేండ్ల పాటు ఆయ‌న ఈ పదవిలో కొనసాగుతారు. ఈ పదవిలో నియమితులైన మల్లాది విష్ణుకు క్యాబినెట్‌ హోదా ఉంటుందని ప్రభుత్వం తన ఉత్తర్వుల్లో వెల్లడించిన విష‌యం విధిత‌మే.

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top