వైయ‌స్ఆర్‌సీపీ కేంద్ర కార్యాల‌యంలో గ‌ణతంత్ర వేడుక‌లు 

జాతీయ జెండాను ఆవిష్కరించిన వైయ‌స్‌ జగన్‌
 

 హైదరాబాద్‌ : వైయ‌స్ఆర్‌ కాంగ్రెపార్టీ కేంద్ర కార్యాలయంలో 70వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్షనేత వైయ‌స్‌ జగన్‌మోహన్‌ రెడ్డి జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ వేడుకల్లో రాజ్యసభ ఎంపీ  విజయసాయి రెడ్డి, ఎమ్మెల్సీ ఉమ్మారెడ్డి వెంక‌టేశ్వ‌ర్లు, మిథున్‌రెడ్డి, వైయ‌స్ వివేకానంద‌రెడ్డి, గ‌ట్టు శ్రీ‌కాంత్‌రెడ్డి, ర‌హిమాన్‌, గంగుల ప్ర‌భాక‌ర్‌రెడ్డి, అనిల్‌కుమార్‌యాద‌వ్‌, కొండా రాఘ‌వ‌రెడ్డి,  కార్యకర్తలు, వైయ‌స్ఆర్‌  అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అంతకుముందు రాజ్యాంగ స్ఫూర్తికి తూట్లు పొడిచే శక్తుల నుంచి రాజ్యాంగాన్ని కాపాడుకోవడానికి అందరం కలిసి పనిచేయాల్సిన అవ‌స‌రం ఉంద‌ని  వైయ‌స్‌ జ‌గ‌న్ పిలుపునిచ్చిన విషయం తెలిసిందే.

 

Back to Top