వైయ‌స్ఆర్ సీపీ కేంద్ర కార్యాల‌యంలో ఘనంగా రిపబ్లిక్‌ డే వేడుకలు

జాతీయ జెండాను ఆవిష్కరించిన ఎమ్మెల్సీ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు

తాడేప‌ల్లి: వైయస్ఆర్ కాంగ్రెస్‌ పార్టీ కేంద్ర కార్యాలయంలో గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. పార్టీ సీనియర్‌ నేత, శాసనమండలి సభ్యులు ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, శాసనమండలి సభ్యులు శ్రీ లేళ్ల అప్పిరెడ్డి కార్యక్రమానికి అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ.. దేశ స్వాతంత్య్రంకోసం ప్రాణాలర్పించిన, త్యాగాలు చేసిన మహనీయులను అందరూ ఆదర్శంగా తీసుకోవాలన్నారు. ముఖ్యమంత్రి వైయస్‌ జగన్ నాయ‌క‌త్వంలో కులం, మ‌తం, ప్రాంతం, పార్టీ ఇవేవీ లేకుండా.. సమానత్వం దిశగా పాల‌న సాగుతోంద‌న్నారు. పేదరిక నిర్మూల‌న కోసం అనేక సంక్షేమ పథ‌కాలను అమ‌లు చేస్తున్నార‌న్నారు. ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పిన హామీల్లో ఇప్ప‌టికే 95 శాతం హామీలు నెర‌వేర్చార‌న్నారు. మేనిఫెస్టోలో లేకపోయినా, ఓబీసీలు కూడా నష్టపోతున్నారనే ఉద్దేశంతో వారికోసం ఈబీసీ నేస్తం పథకాన్ని అమలు చేశారని తెలిపారు. 

ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి వైయస్‌ జగన్ రాజ్యాంగ నిర్మాత‌ అంబేద్కర్‌ చూపిన బాటలో నడుస్తూ కులం,మతం,ప్రాంతం,పార్టీ అనే వాటికి తావులేకుండా అందరికీ సమానత్వం కల్పిస్తూ పరిపాలన సాగిస్తున్నారన్నారు. పేదరికం నిర్మూలన దిశగా సంక్షేమం, అభివృద్ధి రెండుకళ్లుగా రాష్ట్రాన్ని ముందుకు తీసుకువెళ్తున్నారన్నారు. పరిపాలనను ప్రజలకు చేరువుగా తీసుకువెళ్తున్నారని అన్నారు. నూతన జిల్లాల ఏర్పాటు కూడా ఇందులో భాగమేనన్నారు. కార్యక్రమంలో పార్టీ శాసనసభ్యులు కిలారి రోశయ్య, విజయవాడ సిటి అధ్యక్షులు బొప్పన భవకుమార్, ఎస్సీ కార్పోరేషన్‌ ఛైర్మన్‌లు శ్రీమతి అమ్మాజీ,  కనకారావు మాదిగ, నవరత్నాల అమలు ప్రోగ్రామ్‌ వైస్‌ ఛైర్మన్‌ నారాయణమూర్తి, రాష్ట్ర గ్రంథాలయ సంస్థ చైర్మన్ మందపాటి శేషగిరి రావు, పలువురు పార్టీ నేతలు పాల్గొన్నారు.

తాజా వీడియోలు

Back to Top