తాడేపల్లి: ఉక్కు మనిషి, దేశ ఐక్యతకు స్ఫూర్తిగా నిలిచిన దేశ మాజీ హోంమంత్రి సర్దార్ వల్లభాయ్ పటేల్‌ను ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకోవాలని వైయస్ఆర్‌సీపీ అధినేత, మాజీ సీఎం వైయస్ జగన్ మోహన్ రెడ్డి అన్నారు. సర్దార్ వల్లభాయ్ పటేల్ వర్ధంతిని పురస్కరించుకుని వైయస్ జగన్ మోహన్ రెడ్డి ఘనంగా నివాళులర్పించారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు. స్వాతంత్య్ర సమరంలో చురుకుగా పాల్గొనడమే కాకుండా దేశానికి స్వాతంత్య్రం సిద్ధించిన తర్వాత సుమారు 535 సంస్థానాలను విలీనం చేసిన ఘనత పటేల్‌కే దక్కుతుందని పేర్కొన్నారు. ఆయన వారసత్వం ఐక్యత, ప్రగతి స్ఫూర్తిని ప్రేరేపిస్తూనే ఉంటుందని వైయస్ జగన్ ట్వీట్ చేశారు.