ఈసారి చంద్ర‌బాబును నమ్మే స్థితిలో జనం లేరు

వైయ‌స్ఆర్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రెడ్డి శాంతి

 శ్రీకాకుళం : డ్వాక్రా రుణమాఫీ పేరుతో మహిళలను సీఎం చంద్రబాబు నాయుడు మోసగించారని  వైయ‌స్ఆర్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రెడ్డి శాంతి దుయ్యబట్టారు. 2014 ఎన్నికల సమయంలో మహిళా సంఘాల రుణాలు రద్దు చేస్తానని చెప్పిన చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తర్వాత విస్మరించారని ధ్వజమెత్తారు.

పసుపు–కుంకుమ పేరుతో ప్రతి డ్వాక్రా సభ్యురాలి ఖాతాకు రూ.10వేలు జమ చేస్తామని చెప్పి ఇంతవరకు పూర్తిస్థాయిలో చెల్లించలేదని మండిపడ్డారు. రుణమాఫీ కాకపోవడంతో మహిళా సంఘాలు సభ్యులు అప్పులు ఊబిలో కూరుకుపోయారని పేర్కొన్నారు. ఎన్నికలు సమీపిస్తున్నందున మరోసారి మోసం పూరితమైన హామీలు ఇచ్చేందుకు చంద్రబాబు వస్తాడని, ఈసారి వాటిని నమ్మే స్థితిలో జనం లేరని స్పష్టం చేశారు.

 

Back to Top