కోతలు, కొరతలు కారణాలు...

చంద్రబాబు 5ఏళ్లలో డిస్కంల నెత్తిన పెట్టిన అప్పు - 25,000 కోట్లు

చంద్రబాబు 5 ఏళ్లలో  ప్రభుత్వానికి లేకుండా చేసిన ఇసుక ఆదాయం - 4,000 కోట్లు

నలభై ఏళ్ల అనుభవం అని చెప్పుకునే బాబు ఐదేళ్ల పాలనలో ఇలాంటి నష్టాలు ఎన్నో జరిగాయి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి. కొత్తగా అధికారం చేపట్టిన వైయస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం అలాంటి నష్టాలన్నిటినీ పూడ్చేందుకు ప్రయత్నిస్తోంది. ఓపక్క సంక్షేమ పథకాలు ఒక్కొక్కటిగా అమలు పరుస్తూనే, నష్టపోయిన ప్రభుత్వ సంస్థలను గాడిలో పెట్టేందుకు ప్రయత్నిస్తోంది. కొత్త ప్రభుత్వం ఏర్పాటు అయ్యి ఇప్పటికి మూడు నెలలు మాత్రమే అయ్యింది. కానీ చంద్రబాబు మాత్రం ప్రభుత్వం మీద తన అక్కసును తొలి రోజునుంచే ప్రదర్శిస్తున్నాడు. చిన్న చిన్న సమస్యలను సైతం భూతద్దంలో పెడుతూ రాద్ధాంతం చేస్తున్నాడు. అయితే అలాంటి సమస్యలను కూడా సీఎం వైయస్ జగన్ నిర్లక్ష్యం చేయలేదు. వాటి పరిష్కారాలను కూడా వేగంగానే ప్రజలముందుంచుతున్నారు. పరిష్కరించే ప్రయత్నం చేస్తున్నారు.

ఇసుక కొరతపై బాబు రగడ

బాబు పాలనలో ఇసుక ఉచితం అని మాయ చేసి తెలుగు తమ్ముళ్ల ఇసుక మాఫియాకు ఎలా హద్దు మీరిపోయిందో చూసాం. ఇసుక అక్రమాలపై తిరగబడ్డ ఏర్పేడు గ్రామవాసులు 20 మందిని లారీలతో తొక్కించి చంపి, ఇసుక అక్రమ రవాణా అడ్డుకున్న అధికారులను జుత్తు పట్టి ఈడ్పించిన సంఘటనలు రాష్ట్ర ప్రజలు మరువగలరా? ఏడాదికి 800 కోట్లకు పైగా ఇసుక ద్వారా ప్రభుత్వానికి వచ్చే ఆదాయాన్ని రాకుండా చేసాడు చంద్రబాబు. ఇసుకను టీడీపీ నాయకుల ఆస్తిలా చేసి కోటానుకోట్లు అక్రమ వ్యాపారాలకు ఊతమిచ్చాడు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే ఈ ఇసుక దోపిడీకి అడ్డుకట్టపడింది. కరువుకు బ్రాండ్ అంబాసిడర్ లాంటి చంద్రబాబు తప్పుకున్నాక రాష్ట్రంలో వరుణుడు కరుణించాడు. పుష్కలంగా వర్షాలతో చెరువులు, ప్రాజెక్టులు నిండుతున్నాయి. పైగా పై రాష్ట్రాల్లోనూ విపరీతమైన వర్షాల కారణంగా ఏపీలోనూ వరదలు ముంచెత్తుతున్నాయి. ఇలాంటి పరిస్థితిలో ఇసుక తవ్వితీయడం సాధ్యం అవుతుందా? ఏ ప్రభుత్వానికీ కాదు. కానీ ఈ కారణాలను ప్రజలకు చెప్పకుండా ఇసుక కొరత అనే ఒకే ఒక్క మాటతో చంద్రబాబు రాద్ధాంతం చేస్తున్నాడు. నిజానికి వర్షాల సీజన్ లో నిర్మాణ రంగం సాధారణంగానే స్లో అవుతుంది. కానీ ఇవన్నీ దాస్తూ బాబు కేవలం ఇసుక కొరత వల్ల రాష్ట్రం అంతా అల్లకల్లోలం అయిపోయిందన్న బిల్డప్ ఇస్తున్నాడు. అయితే ముఖ్యమంత్రి వైయస్ జగన్ ఇసుక కొరతను అధిగమించే విధివిధానాలను ప్రకటించారు. వీలైనన్ని ఎక్కువ రీచ్ లను అందుబాటులో ఉంచుతున్నారు. ఇసుక పక్కదారి పట్టకుండా ఉండేందుకు పకడ్బందీగా చర్యలు తీసుకుంటున్నారు. దీనవల్ల అటు ప్రజలకు ఇసుక లభ్యత, ఇటు ప్రభుత్వానికి ఆదాయం రెండూ సాధ్యం అవుతున్నాయి.

కరెంటు కోతలపై బాబు పచ్చి కోతలు

తన హయాంలో కరెంటు కోతలు లేవని, ఇప్పుడు రాష్ట్రం చీకట్లో మగ్గిపోతోందని కోతలు కోసేస్తున్నాడు చంద్రబాబు. కొన్నిగ్రామాల్లో ఉన్న స్వల్ప విద్యుత్ అంతరాయాలను భారీ సమస్యగా చిత్రీకరిస్తూ ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నాడు. కానీ అధిక ధరలకు విద్యుత్ కొనుగోలు చేస్తూ అస్మదీయులకు కోట్లు దోచిపెట్టిన మాట మాత్రం బయటపెట్టడం లేదు. రాష్ట్రంలో 60% విద్యుత్ ఉత్పత్తి సంప్రదాయ పద్ధతుల్లో జరుగుతుంది. అంటే బొగ్గుతో నడిచే థర్మల్ పవర్ ప్రాజెక్టుల నుంచి వస్తుంది. ఈ బొగ్గును అధికంగా ఒరిస్సా లోని కోలార్ గనుల నుంచి దిగుమతి చేసుకుంటుంది ఏపీ ప్రభుత్వం. ప్రస్తుతం కోలార్ గనుల్లో కార్మికుల ఆందోళనలు, సమ్మెల వల్ల కొద్ది రోజులుగా బొగ్గు సరఫరా నిలిచిపోయింది. 1100 మెగావాట్ల విద్యుత్ కొరత ఏర్పడింది. డిస్కంలను 25000 కోట్ల అప్పుల్లో ముంచి పోయాడు చంద్రబాబు. ఆ బకాయిల్లో నేటి వైయస్ జగన్ ప్రభుత్వం తీర్చుతోంది. పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ కు 1,276 కోట్లు, కేంద్ర సంస్థ NTPC కి 3,413 కోట్లు అంటే దాదాపు 4,690 కోట్లు చెల్లించాలని నిర్ణయించింది. విద్యుత్ లోటును భర్తీ చేసేందుకు ప్రయత్నిస్తూనే, మరోపక్క డిస్కంల అప్పులు తీర్చుతున్నారు సీఎం వైయస్ జగన్. ఒక పక్క కేంద్రానికి బొగ్గును నిరంతరాయంగా సరఫరాను చేయమని కోరారు. పొరుగు రాష్ట్రమైన తెలంగాణా సింగరేణి నుండి వచ్చే 4 ర్యాకులను 9కి పెంచి ఇవ్వమని కేసీఆర్ కు విజ్ఞప్తి చేసారు. అతి త్వరలో విద్యుత్ కోతలు అధిగమిస్తామని చెబుతున్నారు సీఎం వైయస్ జగన్.

Back to Top