భూ మాఫియా ఆరోపణలపై బహిరంగ చర్చకు సిద్ధమా?

టీడీపీ, ఎల్లోమీడియాకు మంత్రి ఉషశ్రీ చరణ్‌ సవాల్‌

వాస్తవాలేంటో ఆధారాలతో సహా చూపిస్తా

ఎల్లో గ్యాంగ్‌పై పరువు నష్టం దావా 

అనంతపురం: భూ మాఫియా ఆరోపణలపై బహిరంగ చర్చకు సిద్ధమా?అని టీడీపీ, ఎల్లోమీడియాకు మంత్రి ఉషశ్రీ చరణ్‌ సవాలు విసిరారు. తప్పుడు కథనాలు రాస్తున్న ఎల్లో గ్యాంగ్‌పై పరువు నష్టం దావా వేసినట్లు  మంత్రి ఉషశ్రీచరణ్‌ పేర్కొన్నారు. శనివారం ఎమ్మెల్యే తోపుదూర్తి ప్రకాశ్‌రెడ్డితో కలిసి మంత్రి మీడియాతో మాట్లాడారు. టీడీపీ పార్టీ నేతలందరికీ కూడా ఓపెన్‌ చాలెంజ్‌ చేస్తున్నాను. 2019లో నా అఫిడవిట్‌ ఎంత ఉందో ఈ రోజుకు ఎంత ఉందో మీరు తీసుకోండి. అలాగే టీడీపీ నేతలు ఉన్నం హనుమంతరాయ చౌదరి, ఉన్నం ఉదయ్‌ చౌదరి ఆస్తుల విలువ ఎంత ఉన్నాయో చూడండి. నేను నాకు ఉన్న ఆస్తి మొత్తం టీడీపీ నేతలకు రాసిస్తాను. వాళ్ల ఆస్తులు నాకు రాసివ్వడానికి సిద్ధమా అని సవాలు విసిరారు. ఏడాది క్రితమే ఇసుక, సారా గురించి చెప్పాను. ఎరికైనా దమ్ముంటే వచ్చి నిరూపించాలని సవాలు విసిరి ఏడాది పూర్తి అయ్యింది. ఇంతవరకు ఎవరూ నిరూపించలేకపోయారు. ఇలాంటి వాటిపై డిబేట్‌ పెడితే నేను సిద్ధంగా ఉన్నానని చెప్పారు. ఎల్లో మీడియా, టీడీపీ నేతలపై పరువు నష్టం దావా కేసు వేసినట్లు మంత్రి వెల్లడించారు. 

 

Back to Top