వికేంద్రీకరణతోనే అన్ని ప్రాంతాల అభివృద్ధి

రాష్ట్ర సంపదంతా కాకినాడలో పెట్టాలని 50 వేల మందితో నేను పాదయాత్ర చేస్తే ఒప్పుకుంటారా..?

రౌండ్‌ టేబుల్‌ సమావేశంలో ఆర్‌ అండ్‌ బీ శాఖ మంత్రి దాడిశెట్టి రాజా

కాకినాడ: ఆరు దశాబ్దాలకు పైగా అందరం కలిసి అభివృద్ధి చేసిన హైదరాబాద్‌ రాష్ట్ర విభజనతో మనది కాకుండా అయిపోయిందని, అలాంటి పరిస్థితి పునరావృతం కాకుండా ఉండాలంటే అభివృద్ధి వికేంద్రీకరణే సరైన మార్గం అని ఆర్‌ అండ్‌ బీ శాఖ మంత్రి దాడిశెట్టి రాజా అన్నారు. ఏపీ అభివృద్ధి – పరిపాలన వికేంద్రీకరణ అంశంపై కాకినాడలో రౌండ్‌ టేబుల్‌ సమావేశం ప్రారంభమైంది. ఈ సమావేశానికి మంత్రులు చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ, దాడిశెట్టి రాజా, మాజీ మంత్రి కురసాల కన్నబాబు, ఎంపీలు పిల్లి సుభాష్‌ చంద్రబోస్, వంగా గీతా హాజరయ్యారు.  

ఈ సందర్భంగా రౌండ్‌ టేబుల్‌ సమావేశంలో మంత్రి దాడిశెట్టి రాజా మాట్లాడారు. రాష్ట్ర ప్రజలు కట్టిన ట్యాక్స్, కష్టాన్ని అంతా కాకినాడలో పెట్టాలని తాను 50 వేల మందితో పాదయాత్ర చేస్తే ఒప్పుకుంటారా..? అని ప్రశ్నించారు. హైదరాబాద్‌ను కోల్పోయిన తరువాత ఎదురైన అనుభవాన్ని అందరూ గుర్తుపెట్టుకోవాలన్నారు. మళ్లీ రాష్ట్ర సంపద అంతా ఒకే చోట ఎందుకు పెట్టాలని, రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందితే కలిగే నష్టమేంటని ప్రశ్నించారు. వికేంద్రీకరణతోనే అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందుతాయని చెప్పారు. మూడు రాజధానులకు అందరూ మద్దతివ్వాలని కోరారు. అమరావతిలోని కొంతమంది.. వారు చెప్పింది వినకపోతే రాష్ట్రాన్ని ఏవిధంగా నాశనం చేయాలని చూస్తున్నారో ప్రజలంతా గమనిస్తున్నారన్నారు. ఇక్కడున్న మేధావులు, విద్యార్థులు ఆలోచించి.. ఈ రౌండ్‌ టేబుల్‌ సమావేశానికి తగిన దిశానిర్దేశం చేయాలని కోరారు. 
 

Back to Top