వైయ‌స్ఆర్ సీపీలో చేరిన రావెల కిషోర్‌బాబు దంప‌తులు

తాడేప‌ల్లి: మాజీ మంత్రి రావెల కిషోర్ బాబు, ఆయ‌న స‌తీమ‌ణి శాంతి జ్యోతి వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్య‌క్షులు, ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి స‌మ‌క్షంలో వైయ‌స్ఆర్ సీపీలో చేరారు. తాడేప‌ల్లిలోని సీఎం క్యాంపు కార్యాల‌యంలో సీఎంను క‌లిసిన రావెల కిషోర్ బాబు దంప‌తులు వైయ‌స్ఆర్ సీపీ చేరారు. ఈ మేర‌కు రావెల కిషోర్ బాబుకు పార్టీ కండువా క‌ప్పి వైయ‌స్ఆర్ సీపీలోకి ఆహ్వానించారు. ఈ కార్య‌క్ర‌మంలో ఎంపీ నందిగం సురేష్, ఎమ్మెల్సీ లేళ్ళ అప్పిరెడ్డి, ప్రత్తిపాడు వైయ‌స్‌ఆర్‌సీపీ సమన్వయకర్త బాలసాని కిరణ్‌ కుమార్ ఉన్నారు. 

Back to Top