సీఎం వైయస్‌ జగన్‌ను కలిసిన రమణదీక్షితులు

తాడేపల్లి: ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని తిరుమల తిరుపతి దేవస్థాన ప్రధాన అర్చకులు రమణ దీక్షితులు, ఇతర అర్చకులు మర్యాదపూర్వకంగా కలిశారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రిని కలిసి.. శ్రీ వేంకటేశ్వర స్వామి వారి ప్రసాదాలను అందజేశారు. ఈ సందర్భంగా తిరుమల, తిరుపతి దేవస్థానాల పరిధిలోని తిరుమల వేంకటేశ్వరస్వామి, తిరుపతి గోవిందరాజ స్వామి, తిరుచానూరు పద్మావతి అమ్మవార్ల ఆలయాలకు సంబంధించిన 15 మందికి వంశపారంపర్యాన్ని పునరుద్దరించడంపై ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌కు రమణ దీక్షితులు, ఇతర అర్చకులు కృతజ్ఞతలు తెలియజేశారు. 
 

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top