వైయస్‌ జగన్‌తోనే ప్రత్యేక హోదా సాధ్యం

రామకోట సుబ్బారెడ్డి
 

హైదరాబాద్‌: వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డితోనే ఏపీకి ప్రత్యేక హోదా సాధ్యమవుతుందని వైయస్‌ఆర్‌సీపీలో చేరిన ఏపీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి బావ రామకోట సుబ్బారెడ్డి పేర్కొన్నారు. వైయస్‌ఆర్‌సీపీలో చేరిన అనంతరం ఆయన పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు.  వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీలో చేరేందుకు ముఖ్య కారణం ఏపీకి గతంలో జరిగిన అన్యాయం, రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తామని కేంద్ర ప్రభుత్వం అన్యాయం చేసిందన్నారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం వైయస్‌ జగన్‌ అలుపెరగని పోరాటం చేస్తున్నారని చెప్పారు. టీడీపీ ప్రభుత్వం ఒకసారి ప్రత్యేక హోదా, మరోసారి ప్రత్యేక ప్యాకేజీ అంటూ ఆంధ్ర ప్రజలను మభ్యపెట్టారన్నారు. రాష్ట్రాన్ని విడగొట్టిన కాంగ్రెస్‌తో టీడీపీ జత కట్టి మరోసారి మోసం చేసేందుకు చంద్రబాబు కంకణం కట్టుకున్నారని విమర్శించారు. వైయస్‌ జగన్‌ సీఎం అయితేనే రాష్ట్రానికి ప్రత్యేక హోదా వస్తుందని పేర్కొన్నారు. వైయస్‌ జగన్‌ను సీఎం చేసుకుంటేనే ప్రత్యేక హోదా సాధించడం సాధ్యమవుతుందన్నారు. నవరత్నాలకు ఆకర్శితులమై పార్టీలో చేరినట్లు సుబ్బారెడ్డి కుమారులు పేర్కొన్నారు.

నవరత్నాలు కాపీ: ఎమ్మెల్యే రాంరెడ్డి ప్రతాప్‌రెడ్డి
వైయస్‌ జగన్‌ ప్రకటించిన నవరత్నాల పథకాలను చంద్రబాబు కాపీ కొడుతున్నారని ఎమ్మెల్యే రాంరెడ్డి ప్రతాప్‌రెడ్డి విమర్శించారు. పింఛన్ల పెంపు, డ్వాక్రా రుణాల మాఫిని చంద్రబాబు ప్రకటించారన్నారు. ఏపీ ప్రజలు సుఖంగా ఉండాలంటే వైయస్‌ జగన్‌ ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటున్నారని చెప్పారు. ఏ పల్లెకు వెళ్లినా నమ్మం బాబూ అంటూ నినదిస్తున్నట్లు చెప్పారు. 
 

Back to Top