నెల్లూరు జిల్లాలో టీడీపీకి షాక్‌

వైయస్‌ఆర్‌సీపీలోకి మంత్రి సోమిరెడ్డి బావ రామకోట సుబ్బారెడ్డి

వైయస్‌ జగన్‌ సమక్షంలో పార్టీలో చేరిక

హైదరాబాద్‌: నెల్లూరు జిల్లాలో అధికార తెలుగు దేశం పార్టీకి షాక్‌ తగిలింది. ఏపీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి అక్క భర్త రామకోట సుబ్బారెడ్డి వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. సుబ్బారెడ్డి కుమారులు శశిథర్‌రెడ్డి, కళాధర్‌రెడ్డి, అనుచరులతో కలిసి కొద్ది సేపటి క్రితం వైయస్‌ జగన్‌మోహన్‌ రెడ్డిని పార్టీ కేంద్ర కార్యాలయంలో కలిశారు.

ఈ మేరకు వారికి వైయస్‌ జగన్‌ కండువాలు కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. కార్యక్రమంలో పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీలు విజయసాయిరెడ్డి, వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి,  వైవీ సుబ్బారెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి, కావలి ఎమ్మెల్యే రాంరెడ్డి ప్రతాప్‌రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
 

Back to Top