బీసీల్లో పేదరికాన్ని తొలగించేందుకు సీఎం వైయ‌స్ జగన్‌ కృషి

రాజ్య‌స‌భ స‌భ్యులు మోపిదేవి వెంక‌ట‌ర‌మ‌ణ‌
 

విజ‌య‌వాడ‌: బీసీల్లో పేదరికాన్ని తొలగించేందుకు సీఎం వైయ‌స్ జగన్‌ కృషి చేస్తున్నార‌ని వైయ‌స్ఆర్‌సీపీ రాజ్య‌స‌భ స‌భ్యులు మోపిదేవి వెంక‌ట‌ర‌మ‌ణ అన్నారు. బీసీల్లో ఆత్మస్థైర్యాన్ని నింపుతున్నారు. చదవుకు పేదరికం అడ్డుకావొద్దని ఆయన భావించార‌ని మోపిదేవి తెలిపారు. బీసీ మ‌హాస‌భ‌లో మోపిదేవి మాట్లాడారు. చంద్రబాబు బీసీలను కుల వృత్తుల వారీగానే చూశాడు.. బీసీలను తోలు తీస్తాం, తోకలు కత్తిరిస్తాం అన్నాడు.. బీసీల ఆత్మగౌరవాన్ని నిలిపిన వ్యక్తి వైయ‌స్ జగన్ మాత్రమే అని  కొనియాడారు. చంద్ర‌బాబు బీసీలను చిన్నచూపు చూస్తే..బీసీలకు సీఎం వైయ‌స్ జగన్‌ సముచిత స్థానం కల్పించారు. బీసీలంతా సీఎం వైయ‌స్‌ జగన్‌ వెంటనే ఉన్నారు. బీసీ కులాలకు 56 కార్పొరేషన్లు కల్పించిన ఘతన సీఎం వైయ‌స్ జగన్‌దే అన్నారు.  బీసీల ఆత్మగౌరవాన్ని పెంచిన వ్యక్తి సీఎం వైయ‌స్ జగన్‌ అని ఎంపీ మోపిదేవి వెంక‌ట‌ర‌మ‌ణ‌ తెలిపారు. 

Back to Top