గిరిజనుల గుండె చప్పుడు సీఎం వైయ‌స్ జగన్‌ 

ఉప ముఖ్యమంత్రి రాజన్నదొర 

గిరిజన సంస్కృతి, సంప్రదాయాలతో హోరెత్తిన సాగరతీరం

విశాఖ : దేశంలో ఏ రాష్ట్రంలో లేనివిధంగా గిరిజనుల అభివృద్ధి కోసం అనేక పథకాలను సీఎం వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి అమలు చేస్తూ వారి గుండెల్లో శాశ్వత స్థానం సంపాదించారని ఉప ముఖ్యమంత్రి పీడిక రాజన్నదొర అన్నారు. గిరిజన స్వాతంత్య్ర సమరయోధులను స్మరించుకుంటూ బిర్సా ముండా జయంతి సందర్భంగా విశాఖలో గిరిజన గౌరవ దిన వారోత్సవాలను రాజన్నదొర ప్రారంభించారు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ.. గిరిజనులకు 2 లక్షల పుడక భూములను పంపిణీ చేసిన ఘనత సీఎం వైయ‌స్ జగన్‌మోహన్‌రెడ్డికే దక్కుతుందన్నారు. గిరిజన నాయకులు, సమరయోధుల గురించి, గిరిజనుల సంస్కృతి, సంప్రదాయాల గురించి ప్రపంచానికి తెలియాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. అంతకుముందు గిరిజన కార్నివాల్‌ను ప్రారంభించారు. తమ సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబించేలా నృత్యాలు చేస్తూ సాగర తీరాన్ని హోరెత్తించారు. జెడ్పీ చైర్‌పర్సన్‌ సుభద్ర, ఎమ్మెల్యేలు చెట్టి పాల్గుణ, భాగ్యలక్ష్మి, కళావతి, జీసీసీ చైర్‌పర్సన్‌ స్వాతిరాణి పాల్గొన్నారు.

Back to Top