గుండెల‌ను హ‌త్తుకుంటున్న వైయ‌స్ జ‌గ‌న్ కొత్త పాట‌

సోష‌ల్ మీడియాలో దుమ్మురేపుతున్న రావాలి జ‌గ‌న్‌..కావాలి జ‌గ‌న్ పాట   

హైదరాబాద్‌: వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎన్నిక‌ల ప్ర‌చారం కోసం ఆవిష్క‌రించిన రావాలి జగన్‌ – కావాలి జగన్‌ పాట ఆంధ్రరాష్ట్రాన్ని ఉర్రూతలూగిస్తోంది. ‘అమరావతి అంటున్నది, ఆంధ్రావని అంటున్నది, ఉత్తరాంధ్ర, కోస్తాంధ్ర, పలనాడు అంటున్నది, రాయలసీమలో గడప గడప అంటున్నది మళ్లొకసారి, ఇంకోసారి పెద్దాయన రాజన్న పాలన.. కన్నుల ముందుకు రావాలంటే, కన్నుల పండుగ కావాలంటే ప్రజల గుండెలో ప్రతిధ్వనించే ప్రత్యేక హోదా రావాలంటే... రావాలి జగన్‌ – కావాలి జగన్‌ మన జగన్‌’ అంటూ రూపొందించిన పాట ప్రతి గుండెను అత్తుకునే విధంగా ఉంది. రాష్ట్ర స్థితిగతులు, డ్వాక్రా మహిళలకు జరిగిన మోసం, చావుల పేరిట మోసం జరిగిన యువతకు న్యాయం జరగాలంటే, పెన్షన్, ఆంధ్రావని పచ్చటి స్వర్గం కావాలంటే, రైతుల కళ్లలో పసిడిపంటలా బంగారు కాంతులు మెరవాలంటే రావాలి జగన్‌ – కావాలి జగన్‌ అంటూ ఆంధ్రరాష్ట్రం పిలుస్తున్నట్లుగా ఉంది. ఈ పాట‌ను ఇవాళ విడుద‌ల చేయ‌గా ..కొద్దిసేప‌టికే సోష‌ల్ మీడియాలో దుమ్మురేపుతోంది. నెటిజ‌న్లు పాట‌ను డౌన్‌లోడ్ చేసుకొని రింగ్‌టోన్లుగా పెట్టుకుంటున్నారు.
వైయ‌స్ఆర్‌సీపీ అధికారంలోకి వస్తే ఏఏ కార్యక్రమాలు చేపడతామో.. ఈ పాట ద్వారా వివరంగా ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. నవరత్నాలకు సంబంధించిన వివరాలు కూడా ఈ పాటలో ఉన్నాయి.  వైయ‌స్ జగన్‌ ప్రచార పాట కార్యకర్తల్లో ఉత్సాహాన్ని నింపుతోంది.  నవరత్నాల ఫలితాలు, అధికారపార్టీ వైఫల్యాలు.. ప్రజలకు చేరువచేయాలనే ఈ పాట సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది.

(‘రావాలి జగన్‌.. కావాలి జగన్‌’ పాట డౌన్‌లోడ్‌ కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి)..

 

 

Back to Top