ముంపు ప్రాంతాన్ని పరిశీలించిన పీవీపీ

విజయవాడ: వరద ముంపు ప్రాంతాన్ని వైయస్‌ఆర్‌సీపీ నేత పొట్లూరి వరప్రసాద్‌(పీవీపీ) పరిశీలించారు. ఆయా ప్రాంతాల్లో బాధితులతో మాట్లాడి వారి ఇబ్బందులు తెలుసుకున్నారు. ఆయన మాట్లాడుతూ..వరద ముంపు ప్రాంతాల్లో సహాయక చర్యలు కొనసాగుతున్నాయని చెప్పారు. కృష్ణా పరివాహక ప్రాంతంలో వరద కొనసాగుతుందని, వరద కాలనీ‌ల్లోకి రాకుండా శాశ్వత చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. 
 

Back to Top