ఇళ్ల పట్టాల పంపిణీ.. మహిళా సాధికారతకు పెద్దపీట

పీపీ సింధు, కరణం మల్లేశ్వరి, పీటీ ఉష ప్రశంసలు

వారి సందేశాలతో రూపొందించిన సీడీని ఆవిష్కరించిన సీఎం వైయస్‌ జగన్‌

పులివెందుల: ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమంపై రాష్ట్ర వ్యాప్తంగా ప్రశంసలు అందుతున్నాయి. రేపటి (శుక్రవారం) నుంచి రాష్ట్ర వ్యాప్తంగా అర్హులైన మహిళల పేరుమీద జరగనున్న ఇళ్ల పట్టాల పంపిణీ మహిళా సాధికారతకు పెద్దపీట అని దేశంలోని వివిధ రంగాల్లోని ప్రముఖ మహిళలు కొనియాడారు. వారి సందేశాలతో ఏపీ మహిళా కమిషన్‌ చైర్‌పర్సన్‌ రూపొందించిన సీడీని ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆవిష్కరించారు. 

ఇళ్ల పట్టాల పంపిణీపై పీవీ సింధు, కరణం మల్లేశ్వరి, పీటీ ఉష, సుధామూర్తి, అపోలో సంగీతరెడ్డి పద్మావతి వర్సిటీ వైస్‌చాన్స్‌లర్‌ జమున, ఇంటర్నేషనల్‌ జస్టిస్‌ మిషన్‌ ఫ్రీడ్‌ హాగ్‌ యూనిసెఫ్‌ యస్మిన్‌ ఆలీ, కర్ణాటక ఉమెన్స్‌ కమిషనర్‌ చైర్‌పర్సన్‌ ఒడిశా చైర్‌పర్సన్, మణిపూర్‌ చైర్‌పర్సన్, ఎంపీ నవనీత్‌ కౌర్‌ హోంమంత్రి సుచరిత, ఎమ్మెల్యే రోజా సంతోషం వ్యక్తం చేస్తూ సీడీలో వారి అభిప్రాయాలను చెప్పారు. 
 

Back to Top