అభివృద్ధి మాటల్లో కాదు.. చేతల్లో చూపుతున్నాం

పూతలపట్టు ఎమ్మెల్యే ఎంఎస్ బాబు

పూత‌ల‌ప‌ట్టు:  అభివృద్ధి మాటల్లో కాదు.. చేతల్లో చూపుతున్నామని పూతలపట్టు ఎమ్మెల్యే ఎంఎస్ బాబు అన్నారు.  పూతలపట్టు నియోజకవర్గం, యాదమరి మండలం పెరుమాళ్ళపల్లి గ్రామంలో  ఎమ్మెల్యే ఎంఎస్ బాబు గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న ఇంటింటా ప‌ర్య‌టించి నాలుగేళ్ల‌లో ప్ర‌భుత్వం నుంచి పొందిన ల‌బ్ధిని వివ‌రించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ.. గ్రామాల అభివృద్ధే ద్యేయంగా వైయ‌స్ఆర్ కాంగ్రెస్‌ ప్రభుత్వం పని చేస్తోందని  పేర్కొన్నారు.  ఈ ప్రభుత్వం చేతల ప్రభుత్వమని, ముఖ్యమంత్రి వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఎన్నికల హామీల్లో ఇచ్చిన నవరత్నాలను అమలు చేస్తున్నారన్నారు. ప్రతి నిరుపేద కుటుంబానికి నవరత్నాల వల్ల ఆర్థిక చేయూత ఇస్తున్నామని చెప్పారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ ఇళ్ల పట్టాలు పంపిణీ చేయడమే కాకుండా ఇళ్లు కట్టుకునేందుకు ప్రభుత్వం బ్యాంకుల్లో రుణం ఇప్పిస్తోందని చెప్పారు. టీడీపీ పాలనలో జన్మభూమి కమిటీలను ఏర్పాటు చేసి ఆ పార్టీ కార్యకర్తలకు మాత్రమే సంక్షేమ పథకాలు అందేవని, సీఎం వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి పాదయాత్రలో ఇచ్చిన మాట ప్రకారం అర్హత ఉన్న ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాలు అందజేస్తున్నారని వివరించారు. ప్రభుత్వం చేసే అభివృద్ధిని ఓర్వలేక ప్రతిపక్షాల అసత్య ప్రచారాలు చేస్తున్నాయని దుయ్యాబట్టారు.  గతంలో టీడీపీ ప్రభుత్వం అభివృద్ధిని కాగితాలకే పరిమితం చేస్తూ ప్రజలను ఏమార్చిందని గుర్తు చేశారు. ప్రస్తుత ప్రభుత్వం అభివృద్ధిని కళ్లకు కట్టినట్లు ప్రత్యక్షంగా ప్రజలకే చూపుతోందని స్పష్టం చేశారు.  

Back to Top