గిరిజనుల సంక్షేమానికి, విద్యకు వైయస్‌ జగన్‌ పెద్దపీట

 ఉపముఖ్యమంత్రి, గిరిజన శాఖ మంత్రి పుష్పశ్రీవాణి

విజయనగరం : గిరిజనుల సంక్షేమానికి, విద్యకు ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పెద్దపీట వేశారని  ఉపముఖ్యమంత్రి, గిరిజన శాఖ మంత్రి పుష్పశ్రీవాణి  పేర్కొన్నారు. గిరిజన విద్యార్థుల వసతి గృహాల్లో భోజన సదుపాయం కానీ, మౌలిక సదుపాయాల కల్పన కానీ సక్రమంగా అమలు చేయకపోతే సంబంధించిన అధికారులపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆమె హెచ్చరించారు. శనివారం ఆమె గిరిజన విద్య,వైద్యంపై అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా  మంత్రి మాట్లాడుతూ..   గిరిజన విద్య కోసమే రాష్ట్ర బడ్జెట్‌లో రూ. 1245 కోట్లు కేటాయించిన ఎకైక ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ అని ప్రశంసించారు. గిరిజన వసతి గృహాల్లో ఉన్న సమస్యలను తక్షణమే పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు.  
 

తాజా వీడియోలు

Back to Top