తాడేపల్లి: అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో 108,104 అంబులెన్సు సర్వీసులను ప్రారంభించిన ముఖ్యమంత్రి వైయస్ జగన్‌మోహన్ రెడ్డిపై ప్రశంసల జల్లు కురుస్తోంది.వెయ్యికి పైగా అత్యాధునిక సదుపాయాలు కలిగిన అంబులెన్స్‌లను అందుబాటులోకి తెచ్చిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డికి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల బ్రిటిష్ డిప్యూటీ హై కమిషనర్ ఆండ్రూ ఫ్లెమింగ్ బుధవారం ట్విట్టర్ ద్వారా శుభాకాంక్షలు తెలిపారు. ప్రముఖ జర్నలిస్టు రాజ్‌దీప్ సర్దేశాయ్ అభినందించారు. సీఎం వైయస్ జగన్ తీరు అభినందనీయం దర్శకుడు పూరి జగన్నాథ్ ప్రశంసలు కురిపించారు. ప్రపంచమంతా కరోనా సంక్షోభంతో పోరాడుతున్న సమయంలోనూ ప్రజల కోసం సంక్షేమ పథకాలను అమలుచేస్తున్న తీరు అభినందనీయం అంటూ ట్వీట్ చేశారు. జాతీయ వైద్యుల దినోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి 1,088 అంబులెన్స్‌లను బుధవారం విజయవాడలో ప్రారంభించిన విషయం తెలిసిందే. అలాగే వీడియో కాన్ఫరెన్స్ ద్వారా గుంటూరు జీజీహెచ్ ఆస్పత్రిలో నాట్కో కేన్సర్ బ్లాక్‌ను ప్రారంభించారు. క్లిష్ట సమయంలోనూ వైఎస్ జగన్ సంక్షేమ పథకాలను అమలుచేస్తున్న తీరుపై సర్వత్రా ప్రశంసల జల్లు కురుస్తుంది. ప్రజలకు ఎంతో అత్యవసరమైన అంబులెన్సు సర్వీసులను ఒకేరోజు 1,008 వాహనాలను ప్రారంభించడం పట్ల సంగీత దర్శకుడు ఎస్.ఎస్ తమన్ హర్షం వ్యక్తం చేశారు. ఈ మేరకు వైయస్ జగన్‌ను కొనియాడుతూ ట్వీట్ చేశారు.