‘బంగారు కొండవయ్య.. మా జగన్ మావయ్య’

సీఎంపై పాట‌ను ఆల‌పించి అభిమానాన్ని చాటుకున్న చిన్నారులు

ప్రోమో విడుద‌ల చేసిన ఎమ్మెల్యే బియ్యం మ‌ధుసూధ‌న్‌రెడ్డి

చిత్తూరు:  సీఎం వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి అధికారంలోకి వ‌చ్చాక ఎన్నో అద్భుత‌మైన సంక్షేమ ప‌థ‌కాలు అమ‌లు చేస్తూ ప్ర‌జ‌ల హృద‌యాల్లో చెర‌గ‌ని ముద్ర వేసుకుంటున్నారు. విద్యతోనే ముందడుగు అని విశ్వసించి అమ్మ ఒడి, జగనన్న విద్యా దీవెన, జగనన్న గోరుముద్ద, జగనన్న విద్యా వసతి వంటి పథకాలను అమలు చేస్తున్నారు.  ప్ర‌భుత్వ‌ పాఠశాలల రూపురేఖల్ని సమూలంగా మార్చేందుకు మనబడి నాడు-నేడు కార్యక్రమం తీసుకొచ్చారు. ఈ నేపథ్యంలో సీఎం వైయ‌స్‌ జగన్‌ని చిన్నారులు మావయ్య అంటూ సంబోధిస్తూ అభిమానాన్ని చాటుకుంటున్నారు. తాజాగా కొందరు చిన్నారులు ‘బంగారు కొండవయ్య.. మా జగన్ మావయ్య’ అంటూ సాగే పాటను ఆలపించారు. శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బియ్యపు మధుసూధన్‌ రెడ్డి ట్విటర్‌ వేదికగా ఈ విషయాన్ని తెలిపారు. జగనన్న కోసం చిన్నారులు పాడిన మరో అద్భుతమైన పాట అంటూ ఆయన ఈ పాట ప్రొమోని షేర్‌ చేశారు. ప్రోమో విడుదలైందని, త్వరలోనే పాట విడుదల చేస్తామని చెప్పారు. 

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top