నేటి నుంచి ప్రజా చైతన్య కార్యక్రమాలు

వైయ‌స్ఆర్‌సీపీ రాష్ట్ర ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి స‌జ్జ‌ల రామ‌కృష్ణారెడ్డి

తాడేప‌ల్లి: జిల్లాల పునర్వ్యవస్తీకరణపై నేటి నుంచి ప్రజా చైతన్య కార్యక్రమాలు చేప‌ట్టాల‌ని వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి స‌జ్జ‌ల రామ‌కృష్ణారెడ్డి పిలుపునిచ్చారు. దశాబ్దాల తరబడి ప్రజల చిరకాల వాంఛను నెరవేరుస్తూ 13 జిల్లాలను 26 జిల్లాలుగా పెంచే ప్రక్రియలో భాగంగా సీఎం వైయస్ జగన్ కీలక ముందడుగు వేశారు. రాష్ట్ర చరిత్రలోనే ఇదొక చారిత్రాత్మక ఘట్టం. దీనిని దృష్టిలో ఉంచుకుని ఎమ్మెల్యేలు, ఎంపీలు, పార్టీ నియోజకవర్గ సమన్వయకర్తలు వారి నియోజకవర్గాల్లో గురువారం నుంచి శనివారం వరకు (ఈ నెల 27, 28, 29 తేదీల్లో) మూడు రోజులు ప్రజా చైతన్య కార్యక్రమాలు చేపట్టాల‌ని  వైయస్ఆర్ సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి సూచించారు.
 

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top