రాష్ట్ర‌వ్యాప్తంగా `ప్రజల్లో నాడు.. ప్రజల కోసం నేడు'

అన్ని నియోజ‌క‌వ‌ర్గాల్లో సంఘీభావ పాద‌యాత్ర‌లు

 పార్టీ కేంద్ర కార్యాల‌యంలో స‌ర్వ‌మ‌త ప్రార్థ‌న‌లు

చిత్తూరు:  వైయ‌స్ఆర్ సీపీ అధినేత‌, సీఎం వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి చేప‌ట్టిన ప్ర‌జా సంక‌ల్ప యాత్ర పూర్తి అయి మూడేళ్లు అయిన సంద‌ర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా `ప‌్ర‌జ‌ల్లో నాడు- ప్ర‌జ‌ల కోసం నేడు` కార్య‌క్ర‌మంలో భాగంగా శుక్ర‌వారం స‌ంఘీభావ పాద‌యాత్రలు మొద‌ల‌య్యాయి. తాడేప‌ల్లిలోని కేంద్ర కార్యాల‌యంలో స‌ర్వ‌మ‌త ప్రార్థ‌న‌లు చేశారు. వైయ‌స్ఆర్ సీపీ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి, ప్ర‌భుత్వ స‌ల‌హాదారు స‌జ్జ‌ల రామ‌కృష్ణారెడ్డి, మంత్రులు బొత్స స‌త్య‌నారాయ‌ణ‌, అనీల్ కుమార్ యాద‌వ్‌, క‌న్నబాబు, వేణుగోపాల్‌కృష్ణా, నాయ‌కులు లేళ్ల అప్పిరెడ్డి, ల‌క్ష్మీపార్వ‌తి, త‌‌దిత‌రులు ప్రార్థ‌న‌ల్లో పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా బొత్స స‌త్య‌నారాయణ మాట్లాడుతూ..సీఎం వైయ‌స్ జ‌గ‌న్ సంక్షేమ పాల‌న అందిస్తున్నార‌ని చెప్పారు. పాద‌యాత్ర‌లో ఇచ్చిన ప్ర‌తీ హామీని నెర‌వేర్చార‌ని చెప్పారు. చిత్త‌శుద్ధితో పార‌ద‌ర్శ‌కంగా పాల‌న చేస్తున్నార‌ని పేర్కొన్నారు. పాద‌యాత్ర ద్వారా 14 నెల‌ల పాటు వైయ‌స్ జ‌గ‌న్ ప్ర‌జ‌ల‌తో మ‌మేక‌మైయ్యార‌ని, ప్ర‌జ‌ల‌కిచ్చిన ప్ర‌తి హామీని నెర‌వేర్చార‌ని స‌జ్జ‌ల రామ‌కృష్ణారెడ్డి పేర్కొన్నారు. 

ముఖ్యమంత్రి వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్ప పాదయాత్రకు  మూడేళ్లు పూర్తైన‌ సందర్భంగా రాష్ట్రంలో ప్ర‌జా చైతన్య కార్యక్రమాలు చేపట్టారు. `ప్రజల్లో నాడు.. ప్రజల కోసం నేడు' పేరిట 10రోజుల పాటు కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.  అన్ని నియోజ‌క‌వ‌ర్గాల్లో ఎమ్మెల్యేలు, ఇన్‌చార్జ్ర్క్ల్ ఎమ్మెల్యేలు ,ఇన్చార్జ్ లు ,స్థానిక నేతలు సంఘీభావ యాత్ర‌లు ప్రారంభించారు. పుంగ‌నూరులో మంత్రి పెద్దిరెడ్డి రామ‌చంద్రారెడ్డి, క‌ర్నూలులో హాఫీజ్ ఖాన్‌, వైయ‌స్ఆర్ జిల్లా ప్రొద్దుటూరులో ఎమ్మెల్యే రాచ‌మ‌ల్లు శివ‌ప్ర‌సాద్‌రెడ్డి, రాజంపేట‌లో ఎమ్మెల్యే మేడ మ‌ల్లికార్జున‌రెడ్డి, అకేపాటి అమ‌ర్‌నాథ్‌రెడ్డి, ఆయా ప్రాంతాల్లో ఎమ్మెల్యేలు పాద‌యాత్ర‌లు ప్రారంభించారు. విప్ సామినేని ఉద‌య‌భాను ప్ర‌జ‌ల‌తో మ‌మేక‌మై..వారి స‌మ‌స్య‌లు అడిగి తెలుసుకున్నారు. 

వైఎస్సార్‌ జిల్లా: బద్వేలులో వైఎస్సార్‌సీపీ శ్రేణులు పాదయాత్ర నిర్వహించారు. ఈ సందర్భంగా వైఎస్సార్‌సీపీ నేతలు గురుమోహన్‌, రాజగోపాల్‌రెడ్డి, సుందరరామిరెడ్డి, గోపాలస్వామి యద్ధారెడ్డి శ్రీనివాసులు వైఎస్సార్‌ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళర్పించారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రజా సంకల్పయాత్రకు మూడేళ్లు పూర్తయిన సందర్భంగా పోరుమామిళ్లలోని  వైఎస్సార్ విగ్రహాలకు మాజీ ఎంపీపీ చిత్తా విజయ్‌ ప్రతాప్‌రెడ్డి, మండల కన్వీనర్‌ బాష, వైఎస్సార్‌సీపీ నాయకులు,కార్యకర్తలు పూలమాల వేసి నివాళులర్పించారు.

కృష్ణాజిల్లా: జగ్గయ్యపేట పట్టణంలో  ప్రభుత్వ విప్ సామినేని ఉదయభాను ఆధ్వర్యంలో 18, 20,21 వార్డులో ‘ప్రజల్లో నాడు- ప్రజల కోసం నేడు కార్యక్రమాన్ని  నిర్వహించారు. ఈ సందర్భంగా ఇంటింటికి వెళ్లి వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు గురించి ఆయన వివరించారు. ప్రజా సమస్యలను వినతిపత్రాల ద్వారా సేకరించి అప్పటికప్పుడే సంబంధిత అధికారులతో మాట్లాడి పరిష్కరిస్తున్నారు. ఈ కార్యక్రమంలో తన్నీరు నాగేశ్వరరావు, ముత్యాల వెంకటాచలం, చోడవరపు జగదీష్, తుమ్మల ప్రభాకర్, నంబూరి రవి, పలు శాఖల అధికారులు, వాలంటీర్లు, బూత్ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

పశ్చిమగోదావరి: జిల్లాలో ‘ప్రజల్లో నాడు - ప్రజల కోసం నేడు’ పేరిట ఉంగుటూరు ఎమ్మెల్యే పుప్పాల వాసుబాబు పెదవెల్లమిల్లి గ్రామం నుండి పాదయాత్ర ప్రారంభించారు. పోలవరం నియోజకవర్గంలో పాదయాత్రలు ప్రారంభమయ్యాయి. కొయ్యలగూడెం మండలం డిప్పకాయలపాడు గ్రామంలో ఎమ్మెల్యే తెల్లం బాలరాజు పాదయాత్ర ప్రారంభించారు. చింతలపూడి నియోజకవర్గంలో పాదయాత్రలు ప్రారంభమయ్యాయి. జంగారెడ్డిగూడెం తన క్యాంప్ కార్యాలయం నుంచి ఎమ్మెల్యే వి.ఆర్.ఎలిజా పాదయాత్ర ప్రారంభించారు. పాలకోడేరు మండలం కొండేపూడి గ్రామంలో ‘ప్రజల్లో నాడు- ప్రజలకోసం నేడు’ పాదయాత్ర ప్రారంభించారు. ఉండి నియోజకవర్గ వైఎస్సార్‌సీపీ నేత పీవీఎల్‌ నరసింహారాజు, మాజీ ఎమ్మెల్యే​ పాతపాటి సర్రాజు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

కర్నూలు జిల్లా: ప్రజా సంకల్పయాత్ర మూడేళ్లు పురస్కరించుకొని ‘ప్రజల్లో నాడు- ప్రజల్లో నేడు’ పేరిట ప్రజా చైతన్య కార్యక్రమాన్ని ప్రారంభించారు.ఈ సందర్భంగా కర్నూలు వైఎస్సార్‌ సర్కిల్‌ నుంచి ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్  పాదయాత్రను ప్రారంభించారు. 

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top