ఎస్వీబీసీ చైర్మన్‌గా పృథ్వీరాజ్‌

 అమరావతి : ప్రముఖ నటుడు, వైయ‌స్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ నేత పృథ్వీరాజ్‌ బాలిరెడ్డి శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్‌(ఎస్వీబీసీ) చైర్మన్‌గా నియమితులయ్యారు. ఈ క్రమంలో ఈనెల 28న ఎస్వీబీసీ చైర్మన్‌, డైరెక్టర్‌గా ఆయన బాధ్యతలు స్వీకరించనున్నారు. తిరుపతిలో శుక్రవారం జరిగిన ఎస్వీబీసీ బోర్డు సమావేశం ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. తిరుమల తిరుపతి దేవస్థానం ప్రజా సంబంధాల అధికారి పృథ్వీరాజ్‌ నియామకానికి సంబంధించిన ప్రకటన విడుదల చేశారు. మరోవైపు టీటీడీ ఎక్స్‌ అఫీషియో సభ్యుడిగా తుడా చైర్మన్‌ నియామకానికి అనుగుణంగా చట్ట సవరణకు కేబినెట్‌ అంగీకారం తెలిపింది.

తాజా ఫోటోలు

Back to Top