చంద్ర‌బాబు త‌క్ష‌ణ‌మే క్ష‌మాప‌ణ‌లు చెప్పాలి

చంద్ర‌బాబు అహంకార‌పూరిత వ్యాఖ్య‌ల‌పై చీపురుపల్లిలో నిరస‌న ర్యాలీ

విజ‌య‌న‌గ‌రం:  ప్రభుత్వం పేదలకు, బడుగు, బలహీన వ‌ర్గాలకు ఉచితంగా ఇస్తున్న ఇళ్ల స్థ‌లాల‌పై తప్పుడు వ్యాఖలు చేసిన చంద్రబాబు నాయుడు త‌క్ష‌ణ‌మే ప్రజలకు క్షమాపణ చెప్పాల‌ని వైయ‌స్ఆర్‌సీపీ శ్రేణులు డిమాండు చేశారు. చంద్రబాబు నాయుడు అహంకార‌పూరిత వ్యాఖ్య‌ల‌ను ఖండిస్తూ చీపురుపల్లి గ్రామ పంచాయతీ కార్యాలయం నుంచి 3 రోడ్డుల జంక్షన్ వ‌ర‌కు నిర‌స‌న ర్యాలీ చేప‌ట్టారు. అనంత‌రం మానవహారం నిర్వహించి  పోలీస్ స్టేషన్ లో చంద్రబాబు నాయుడుని  అరెస్ట్ చేయాల‌ని ఫిర్యాదు చేశారు.  ఈ సందర్భంగా వైయ‌స్ఆర్‌సీపీ నాయ‌కులు మాట్లాడుతూ.. తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడ‌ నారా చంద్రబాబు నాయుడు ఇటీవల రాష్ట్ర పర్యాటనకు సందర్బంగా ప్రభుత్వం పేదలకు, బడుగు బలహీన వర్గాలకు ఉచితంగా ఇస్తున్న ఇంటి స్థలముల పై  అప్రజాస్వామిక, అహంకార పూరిత వాఖ్య‌లు చేశార‌ని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. పేదల ఇల్లు నిర్మాణం సాగుతుందో వాటిని సమాధులతో పోల్చుతూ చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు అయన దూరకారానికి ప్రతీక అని మండిప‌డ్డారు. దేశంలో ఏ రాష్ట్రంలోనూ లేని విధంగా మహా యజ్ఞంలా ఇక్కడ పేదల ఇళ్ల నిర్మాణం సాగుతుంటే వాటిని సమాధులతో పోల్చుతూ చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు చాలా బాధాకరం, ఓట్లు వేయడానికి మాత్రమే పేదలు పరిమితం కావాలా? పేదలకు ఇళ్ల స్థలాలు ఇస్తుంటే చంద్రబాబుకు ఎందుకంత కడుపుమంట? అని ప్ర‌శ్నించారు.  రాష్గ్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి వైయ‌స్ జ‌గ‌న్ ఎంతో ఉదార స్వభావముతో బడుగు బలహీన వర్గాలకు పేదలకు మంచి చేయాలని ఆలోచనతో ఉచితంగా ఇండ్ల స్థలాలకు అందిస్తున్నార‌ని తెలిపారు. అది ఓర్వవలేక, సహించలేక ఈ రాష్ట్రములో ఉనికి కోల్పోతామని చంద్రబాబు నాయుడు నిరుపేదలకు ఇచ్చిన ఇంటి స్థలాలో శవాలు పాతుకోవడానికి సరిపోతుందని వ్యంగముగా ప్రజ‌ల మ‌ధ్య మాట్లాడ‌టం దుర్మార్గ‌మ‌న్నారు. ఇలాంటి వ్యాఖ్య‌లు చేసిన  చంద్ర‌బాబును వెంట‌నే అరెస్టు చేయాల‌ని డిమాండు చేశారు.   కార్యక్రమంలో చీపురుపల్లి మండల సీనియర్ నాయకులు ఎంపీపీ ఇప్పిలి అనంతం, చీపురుపల్లి మండల పార్టీ అధ్యక్షులు జడ్పీటీసీ వలిరెడ్డి శ్రీనివాసనాయుడు, యువ నాయకులు బెల్లాన వంశీకృష్ణ, సర్పంచ్ మంగళగిరి సుధారాణి, కనకమహాలక్ష్మి అమ్మవారి ఆలయ కమిటీ చైర్మన్ ఇప్పిలి గోవింద్, వైస్ ఎంపీపీ కరిమజ్జి శ్రీనివాసరావు, పట్టణ పార్టీ అధ్యక్షులు వైస్ ఎంపీపీ పతివాడ రాజారావు, మండల విప్ అధికార్ల శ్రీనుబాబు, కర్లాo సొసైటీ అధ్యక్షులు చందక శ్రీనివాసరావు, రామలింగపురం సొసైటీ అధ్యక్షులు పనస అప్పారావు, సర్పంచ్లు రఘుమండ త్రినాథ్, మీసాల రమణ, బాణన శ్రీనివాసరావు, ఏఎంసీ వైస్ చైర్మన్ సతివాడ అప్పారావు, ఎంపీటీసీలు కోరుకొండ దాలయ్య, గెరిడీ రామదాసు, కోసిరెడ్డి రమణ, కొమ్ము చీరంజీవి, ముళ్ళు పైడిరాజు, అప్పికొండ అదిబాబు, కర్ణపు ఆది, ఇప్పిలి కృష్ణ, మజ్జి శంకర్, గంట్యాడ విష్ణు, శేఖర్ పాత్రుడు, గవిడి కల్కి, అంబటి లోకేష్, మీసాల సాయి, మల్లెంపుడి శ్రీను, పాండ్రంకి రాము, శివాలయం డైరెక్టర్ ప్రభాత్ కుమార్, చీపురుపల్లి మండల పార్టీ సోషల్ మీడియా కన్వీనర్ మొండేటి కిషోర్, కో కన్వీనర్ పేకాపు ప్రసాద్ త‌దిత‌రులు పాల్గొన్నారు.

Back to Top