రాష్ట్ర‌ప‌తి ద్రౌప‌తి ముర్ముకు ఘ‌న స‌న్మానం

విజ‌య‌వాడ‌:  రాష్ట్రపతి హోదాలో తొలిసారిగా ఆంధ్రప్రదేశ్‌లో పర్యటిస్తున్న భారత రాష్ట్రపతి  ద్రౌపతి ముర్ము కు సీఎం వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ఘ‌న స్వాగ‌తం ప‌లికారు. కృష్ణా జిల్లా పెనమలూరు మండలం పోరంకిలో రాష్ట్రపతి  ద్రౌపతి ముర్ముకి రాష్ట్ర ప్రభుత్వం తరపున పౌరసన్మానం కార్య‌క్రమం ఏర్పాటు చేశారు.  కార్య‌క్ర‌మంలో రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్‌ హరిచందన్, ముఖ్యమంత్రి  వైయస్‌.జగన్, కేంద్ర పర్యాటక, సాంస్కృతిక, ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధి శాఖ మంత్రి   కిషన్‌ రెడ్డి, ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి  జస్టిస్‌ ప్రశాంత్‌ కుమార్‌ మిశ్రా, పలువురు మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజా ప్రతినిధులు, ఉన్నతాధికారులు రాష్ట్ర‌ప‌తిని ఘ‌నంగా స‌త్క‌రించారు.

Back to Top