శ్రీ‌శైలంలో టీడీపీకి షాక్‌

ఎమ్మెల్యే శిల్పా స‌మ‌క్షంలో 100 టీడీపీ కుటుంబాలు వైయ‌స్ఆర్‌సీపీలో చేరిక‌

నంద్యాల‌: శ్రీ‌శైలం నియోజ‌క‌వ‌ర్గంలో ప్ర‌తిప‌క్ష తెలుగు దేశం పార్టీకి పెద్ద షాక్ త‌గిలింది. సీఎం వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి సంక్షేమ పాల‌న‌కు ఆక‌ర్శితులై 100 టీడీపీ కుటుంబాలు వైయ‌స్ఆర్‌సీపీ గూటికి చేరాయి. శ్రీ‌శైలం మండ‌లం లింగాల‌గ‌ట్టు గ్రామానికి చెందిన 100 కుటుంబాలు టీడీపీని వీడి ఎమ్మెల్యే శిల్పా చ‌క్ర‌పాణిరెడ్డి స‌మ‌క్షంలో వైయ‌స్ఆర్‌సీపీ తీర్థం పుచుకున్నారు.  టిడిపి పార్టీ నాయకులు దేవుడు, నూకరాజు, ఎర్రయ్య, మైలపల్లి మల్లికార్జున ఆధ్వర్యంలో 100 కుటుంబాలు శ్రీశైలం నియోజకవర్గం ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి రెడ్డి సమక్షంలో వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. వీరికి ఎమ్మెల్యే శిల్పా పార్టీ కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఈ సంద‌ర్భంగా ఎమ్మెల్యే శిల్పా చ‌క్ర‌పాణిరెడ్డి మాట్లాడుతూ..దేశంలో మరెక్కడా లేనన్ని సంక్షేమ పథకాలు కేవలం ఏపీలోనే అమలవుతున్నాయని, ఆ సంక్షేమ ఫలాలు మరోసారి పేదలకు దక్కాలంటే వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి మళ్లీ ముఖ్యమంత్రి కావాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు.  ప్ర‌జ‌లంద‌రూ మళ్లీ ఐక్యమత్యంతో సుభిక్షమైన పాలనను తెచ్చుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ప్రతిపక్షాల కుట్రలను, కుతంత్రాలను తరిమికొడ‌దామ‌ని పిలుపునిచ్చారు.  సంక్షేమం అంది ఉంటేనే ఓటు వేయండి, ప్రతి ఇంటికీ మంచి జరిగితేనే ఆశీర్వదించండని ఇంత ధైర్యంగా చెప్పే ముఖ్యమంత్రి దేశంలోనే లేరన్నారు. 

Back to Top