ఐదేళ్ల పండుగ‌

ప్రజా సంకల్ప యాత్రకు  ఐదేళ్లు ..రాష్ట్రవ్యాప్తంగా వేడుకలు 

వైయ‌స్ఆర్ సీపీ కేంద్ర కార్యాల‌యంలో సంబ‌రాలు

రాష్ట్ర వ్యాప్తంగా వైయ‌స్ఆర్ విగ్ర‌హాల‌కు పూల‌మాల‌ల‌తో నివాళులు

అమ‌రావ‌తి: ముఖ్యమంత్రి వైయ‌స్ జగన్  మోహ‌న్ రెడ్డి ప్ర‌తిప‌క్ష నేత హోదాలో చేప‌ట్టిన ప్ర‌జా సంక‌ల్ప యాత్ర 5 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వ‌ర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా సంబ‌రాలు నిర్వ‌హించారు. తాడేప‌ల్లిలోని కేంద్ర కార్యాలయంలో సంబరాలు నిర్వహించారు. మంత్రులు జోగి రమేష్, మేరుగ నాగార్జున, ఎంఎల్సీ లు లేళ్ళ అప్పిరెడ్డి, జంగా కృష్ణమూర్తి, వాసుబాబు కేక్‌ కట్‌ చేశారు.  

  చంద్రబాబు,పవన్ కల్యాణ్ లు రాష్ర్టంలో అలజడులు,అశాంతి రేపటమే పనిగా పెట్టుకున్నారని..... రాష్ర్ట అభివృధ్ది,ప్రజల సంక్షేమం వారికి పట్టదు.....అందుకే వాళ్ళు ఉన్మాదుల్లా.....కొట్టండి,రక్తం చిందించండి.దేనికైనా సిధ్దంగా ఉండండి అంటూ రెచ్చగొట్టేవిధంగా హింసాయుతంగా ప్రవర్తిస్తున్నారు... అని రాష్ర్ట మంత్రులు శ్రీ జోగిరమేష్, మేరుగు నాగార్జున మండిపడ్డారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రజాసమస్యలు ఎలా తెలుసుకోవాలో శ్రీ వైయస్ జగన్ ను చూసి చంద్రబాబు,పవన్ కల్యాణ్ లు తెలుసుకోవాలని హితవు చెప్పారు. ఓపిక,సహనం సమస్యలకు పరిష్కారం చూపాలనే సంకల్పం వైయస్సార్ నుంచి శ్రీ వైయస్ జగన్ పుణికి పుచ్చుకున్నారు. సంవత్సరం 3 నెలలు పాటు జరిగిన పాదయాత్రలో శ్రీ వైయస్ జగన్ ఎక్కడా సహనం కోల్పోలేదని తెలియచేశారు. ప్రజాసంకల్పయాత్రతో పేదల సమస్యలు తెలుసుకుని అధికారంలోకి వచ్చాక వాటి పరిష్కారమే ధ్యేయంగా ముఖ్యమంత్రి శ్రీ వైయస్ జగన్ పనిచేస్తున్నారని  పేర్కొన్నారు. శ్రీ వైయస్ జగన్ ప్రజాసంకల్పయాత్రకు నేటితో ఐదు సంవత్సరాలు పూర్తి అయిన సందర్భాన్ని పురస్కరించుకుని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో వేడుకలు జరిగాయి. దివంగత వైయస్ రాజశేఖరరెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. కేక్ కట్ చేశారు. శ్రీ వైయస్ జగన్ గారితోపాటు ప్రజాసంకల్పయాత్రలో పాల్గొన్నవారికి దుస్తులు పెట్టి గౌరవించడంతోపాటు శాలువాలు కప్పి సత్కరించారు.

         ఈ సందర్భంగా రాష్ర్ట సాంఘిక సంక్షేమ శాఖమంత్రి శ్రీ మేరుగు నాగార్జున మాట్లాడుతూ రాష్ర్టంలో చంద్రబాబు పాలనలో ప్రజాస్వామ్యం అపహాస్యం అయిన తరుణంలోశ్రీ వైయస్ జగన్ ప్రజాసంకల్పయాత్ర పేరుతో చేపట్టిన  పాదయాత్ర చరిత్రలో నిలిచిపోతుందన్నారు. ప్రజలు కష్టాలు ఎదుర్కొంటున్న నేపధ్యంలో శ్రీ వైయస్ జగన్ అప్పట్లో ఆ సాహసోపేత నిర్ణయాన్ని  తీసుకున్నారని తెలియచేశారు.341 రోజులకు పైగా 3,648 కిలోమీటర్ల చేయాలని శ్రీ వైయస్ జగన్ ప్రజాసంకల్పయాత్ర నిర్ణయించి విజయవంతంగా పూర్తి చేశారన్నారు. ఆ పాదయాత్ర ద్వారా ప్రజలఈతిభాధలు తెలుసుకుని వాటిని పరిష్కరించడం ద్వారా శ్రీ వైయస్ జగన్ మహానేతగా ఎదిగారన్నారు. ఆ పాదయాత్రే నేడు రాష్ట్రంలో సంక్షేమ రాజ్యానికి నాంది పలికి,సామాజిక విప్లవానికి దారితీసిందన్నారు. ముఖ్యంగా రాష్ర్టభవిష్యత్తుకు, భావితరాలకు బంగారు బాట వేయడానికి ఈ పాదయాత్ర అవకాశం కల్పించిందని అన్నారు. ఐదు సంవత్సరాల క్రితం శ్రీ వైయస్ జగన్ నేతృత్వంలో ఒక గొప్ప యజ్ఞం ప్రారంభం అయితే దాని ఫలాలు నేడు ప్రజలకు అందుతున్నాయి. పాదయాత్ర పేటెంట్ ఒక్క వైఎస్ కుటుంబానికే దక్కుతుందన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ,మైనారిటీలకు రాజ్యాధికారం కల్పించిన  నేత వైఎస్ జగన్ అని వివరించారు. రాష్ట్రానికి వైఎస్ జగన్ మహనీయులైన ఒక అంబేడ్కర్,జ్యోతీరావుపూలే, జగజ్జీవన్ రామ్ లాగా నిలుస్తున్నారని అన్నారు. పరిపాలన నేడు ఇంటింటికి వెళ్లి పేదవాడి తలుపు తడుతోందన్నారు.పారదర్శకపాలన అందిస్తున్నారన్నారు. గతంలో ఎంతో మంది ముఖ్యమంత్రులు పరిపాలించారు కాని ఈ విధంగా ప్రజలతో మమేకమైన ముఖ్యమంత్రి శ్రీ వైయస్ జగన్,వైయస్సార్ తప్ప మరొకరు కనిపించరు అన్నారు. అణగారిన వర్గాలందరూ భవిష్యత్తుపై భరోసాతో ఉన్నారన్నారు. చంద్రబాబు లాంటి వారి మభ్యపుచ్చే మాటలు నమ్మవద్దని కోరారు.పచ్చమీడియా,చంద్రబాబు,పవన్ కల్యాణ్ ల పట్ల ఎస్సిఎస్టి బిసి మైనారిటీలందరూ అప్రమత్తంగా ఉండాలని కోరారు.

        రాష్ర్ట గృహనిర్మాణశాఖమంత్రి శ్రీ జోగి రమేష్ మాట్లాడుతూ చరిత్రపుటల్లో సువర్ణ అక్షరాలతో లిఖించబడింది శ్రీ వైయస్ జగన్ చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర అన్నారు. రాష్ర్టంలో అణగారిన ఎస్సిఎస్టిబిసి మైనారిటీ  వర్గాల భవిష్యత్తుపై భరోసా ఇచ్చిన నేత వైఎస్ జగన్ అని కొనియాడారు. గొప్ప సంకల్పబలంతో ప్రజాసంకల్పయాత్ర చేపట్టి తద్వారా ప్రజల సమస్యలను తెలుసుకున్న వ్యక్తి శ్రీ వైయస్ జగన్ అన్నారు. ప్రజాసంకల్పపాదయాత్రలో తనను కలసి సమస్యలు పరిష్కరిస్తాననే నమ్మకం ఉంచిన ప్రజలకు న్యాయం చేసేందుకు అలుపెరగక శ్రమిస్తున్నారని అన్నారు. ప్రజల ద్వారా తెలుసుకున్న సమస్యలను వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో పెట్టడమే కాదు అధికారం చేపట్టిన మూడు సంవత్సరాలలోనే దాదాపు 95 శాతం పరిష్కారం చూపిన మార్గదర్శకుడు శ్రీ వైయస్ జగన్ అని వివరించారు. రాష్ర్టంలో యోధుడిగా,వీరుడిగా,ధీశాలిగా,ధీరుడిగా నిలిచారన్నారు. ప్రజల ఆదారాభిమానాలతో అత్యంత శక్తివంతమైన నేతగా ఎదిగిన  జగనన్నను ఎదుర్కోవాలంటే ప్రత్యర్ధుల శక్తి సరిపోవడం లేదన్నారు. ప్రశాంతంగా ఉన్న రాష్ర్టంలో అలజడులు రేపాలని, ఏదో ఒక విధంగా ఇబ్బంది పెట్టాలని చంద్రబాబు, పవన్ కళ్యాణ్ లు  చూస్తున్నారు.పవన్ కల్యాణ్ సినిమాలలో లాగి డైలాగ్ లు చెబుతున్నారని అయితే కూలిపోవడానికి ఇది అత్యంత శక్తివంతమైన పార్టీ నేతృత్వంలో ఉన్న ప్రభుత్వం అని ఇది పేక మేడా కాదు...సినిమా సెట్టింగ్ కాదన్నారు. ప్రజల నుంచి శ్రీ వైయస్ జగన్ ను ఎవరూ వేరు చేయలేరన్నారు. కూలిపోయిన టీడీపీ, కుదేలయిన జనసేన కలసివచ్చినా సరే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కంచుకోటను కదిలించలేరన్నారు. మధ్యవర్తులు లేకుండా బటన్ నొక్కడం ద్వారా లబ్దిదారులకు నేరుగా సంక్షేమఫలాలను అందిస్తున్న తీరు దేశంలో ఎక్కడా లేదన్నారు. మన లక్ష్యం 175...చంద్రబాబుతో సహా అందర్నీ ఒడించడమే లక్ష్యం గా పనిచేయాలని కార్యకర్తలను కోరుతున్నానని కోరారు.  చంద్రబాబు,పవన్ కల్యాణ్ లను చిత్తుచిత్తుగా ఓడించాలని అన్నారు.

         శాసనమండలిలో ప్రభుత్వ విప్ శ్రీ జంగా కృష్ణమూర్తి మాట్లాడుతూ 2017 నవంబర్ 6 వతేదీన ఇడుపులపాయలో ప్రజాసంకల్పయాత్ర ప్రారంభమై 2019 జనవరి 9 వతేదీన ఇచ్చాపురం వరకు సాగింది.రాష్ర్టంలో అన్ని వర్గాలకు సమానన్యాయం జరగాలనే ఆలోచనతో శ్రీ వైయస్ జగన్ పాదయాత్ర చేశారన్నారు. శ్రీ వైయస్ జగన్ గారు నేడు ఇన్ని సంక్షేమ అభివృధ్ది కార్యక్రమాలు అమలు చేయడం ద్వారా తనకు ప్రజలలో ఓ ప్రత్యేక స్దానం పొందగలిగారన్నారు. రాష్ర్టంలో సామాజిక పరిస్ధితులలో మార్పు తెచ్చి అణగారిన వర్గాలకు రాజకీయంగా ఎంతో ప్రాధాన్యం కల్పించారన్నారు. యాత్రలో అనుభవాలు,ప్రజలనుంచి తెలుసుకున్న బాధలు గమనించడం ద్వారా పరిపక్వత చెందిన రాజకీయనేతగా అవతరించారన్నారు. దివంగత వైయస్సార్ ను ఆదర్శంగా తీసుకుని పనిచేశారు కనుకనే ఎన్నో లక్షల మందిని స్వయంగా కలుసుకుని వారి ఇబ్బందులు తెలుసుకుని తన పరిపాలన ద్వారా వాటిని తొలగించే ప్రయత్నం చేస్తున్నారన్నారు. తద్వారా ప్రజల హృదయాలలో శాశ్వత స్ధానం సంపాదించుకుంటున్నారని వివరించారు. 

        కేంద్రకార్యాలయ పర్యవేక్షకులు,ఎంఎల్సి శ్రీ లేళ్ళ అప్పిరెడ్డి మాట్లాడుతూ ప్రజాసంకల్పయాత్రతో శ్రీ వైయస్ జగన్ సువర్ణశకానికి నాంది పలికారన్నారు. ప్రజాస్వామ్య మనుగడకు ఈ పాదయాత్రను కొనసాగించారన్నారు. పాదయాత్రకు ఐదు సంవత్సరాలు పూర్తి అయిన సందర్భంగా రాష్ర్టవ్యాప్తంగా ప్రజలు వేడుకలా జరుపుకుంటున్నారని అన్నారు. పేదరికంపై శ్రీ వైయస్ జగన్ పోరాటం చేస్తూ అట్టడగువర్గాలను జనజీవనస్రవంతిలో తీసుకువచ్చేందుకు నడుంకట్టారన్నారు. పాదయాత్రలో స్వయంగా తెలుసుకున్న పేదల సమస్యలు పరిష్కారం కోసం నవరత్నాలకోసం రూపకల్పన చేశారన్నారు. ఆంధ్రరాష్ర్టం అంటే అక్షర క్రమంలోనే కాదు అన్ని రంగాలలో మొదటి స్ధానంలో ఉంచేందుకు శక్తివంచనలేకుండా పనిచేస్తున్నారు.    

        ఉంగుటూరు శాసనసభ్యుడు శ్రీ పుప్పాల శ్రీనివాసరావు (వాసుబాబు) మాట్లాడుతూ శ్రీ వైయస్ జగన్ ప్రజాసంకల్పయాత్రలో 3,648 కిలోమీటర్ల పాదయాత్ర ద్వారా ప్రజల మధ్య ఉంటూ వారితో మమేకమయ్యారని తెలియచేశారు. శ్రీ వైయస్ జగన్ పై నమ్మకంతో వారి కష్టాలను పరిష్కరించే నేత తమకు దొరికారని భావించారన్నారు. అందుకే ప్రతి గ్రామంలో,ప్రతి ఊరిలో ఆయా వర్గాలు రైతులు,రైతుకూలీలుప,మహిళలు,విద్యార్దులు,వ్యాపారవర్గాలు ఎదుర్కొంటున్న సమస్యలను శ్రీ వైయస్ జగన్ తెలుసుకోగలిగారని వివరించారు. ఈ మూడు సంవత్సరాలలో పాదయాత్రలో ఇచ్చిన హామీలను నెరవేర్చి ఏపిని ముందంజలో ఉంచారన్నారు. గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమానికి వెళ్తే శ్రీ వైయస్ జగన్ ప్రజల గుండెల్లో చొచ్చుకువెళ్ళిన అంశం  తమకు కనిపిస్తుందన్నారు. ఇలాంటి ముఖ్యమంత్రి కొన్ని దశాభ్దాలపాటు అధికారంలో ఉంటే తాము ఆర్ధికంగా బలపడాతమని,తమ పిల్లల భవిష్యత్తు బాగుంటుందని భావిస్తున్నారని వివరించారు.నాడు-నేడు ద్వారా విద్య,ఆరోగ్యం వంటికి ప్రాధాన్యం ఇస్తున్నారని ఎన్నో పధకాలు అమలు చేస్తూ సంక్షేమ సారధిగా నిలిచారన్నారు.

        కార్యక్రమంలో  పార్టీ కార్యకర్తల సమన్వయకర్త శ్రీ పుత్తాప్రతాప్ రెడ్డి , ప్రభుత్వ విప్ శ్రీ డొక్కామాణిక్యవరప్రసాద్,ఫైబర్ నెట్ ఛైర్మన్ శ్రీ పూనూరు గౌతంరెడ్డి, నవరత్నాల ప్రోగ్రామ్ వైస్ ఛైర్మన్ శ్రీ నారాయణమూర్తి,గుంటూరు నగర మేయర్ శ్రీ కావటి మనోహర్ నాయుడు  పలువురు పార్టీ నేతలు పాల్గొన్నారు.

Back to Top