9 న ప్రజా సంకల్పయాత్ర ముగింపు

2109 జగన్ నామ సంవత్సరమే

పాదయాత్రలో ఇచ్చిన ప్రతి హామీ మేనిఫెస్టోలో భాగమే...అమలు పరిచేవే

సీనియర్ నేత సజ్జల రామకృష్ణారెడ్డి

హైదరాబాద్:  ప్రతిపక్ష నాయకులు, వైయస్ఆర్ కాంగ్రెస్ అధ్యక్షులు వైయస్ జగన్ మోహన్ రెడ్డి  మహా సంకల్పంతో చేస్తున్న ప్రజా సంకల్పయాత్ర ఈ నెల 9 వ తేదీన ముగియనుంది. ఈ సందర్భంగా ఈ నెల 3 నుంచి 7 వరకు అన్ని నియోజకవర్గాల్లో సంఘీభావ సభలు నిర్వహిస్తున్నట్లుగా పార్టీ సీనియర్ నేత సజ్జల రామకృష్ణారెడ్డి వెల్లడించారు.  పార్టీ కేంద్ర కార్యాలయంలో మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రజాసంకల్పయాత్ర చారిత్రాత్మకమైనదని, ఏడాదికి పైగా సాగుతున్న దీని ముగింపు పార్టీ శ్రేణులందరికీ కొత్త ఉత్తేజంతో నిండిన పండుగ అని ఆయన అన్నారు. పాదయాత్రకు సంఘీభావంగా రాష్ట్ర  వ్యాప్తంగా పార్టీ శ్రేణులు ఈ నెల రెండో తేదీనుంచి పలు కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని ప్రకటింటారు.మూడో తేదీనుంచి ఏడోతేదీవరకు ప్రతి నియోజకవర్గ సమన్వయకర్త రోజుకు రెండు గ్రామాలలో పర్యటించి,పాదయాత్ర ప్రాముఖ్యత, యాత్ర విజయవంతమైన తీరు ప్రస్తుత ప్రభుత్వ పరిపాలన వైఫల్యం తదితర అంశాలను ప్రజలకు  వివరిస్తారన్నారు. రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలపై ప్రజలను చైతన్యవంతం చేసేలా ఈ కార్యక్రమాలు సాగుతాయని పేర్కొన్నారు. ఈ కార్యక్రమాల అనంతరం ఇఛ్చాపురంలో జరిగే ప్రజా సంకల్పయాత్ర ముగింపు సభకు తరలి వస్తారన్నారు. ఈ యాత్ర  ద్వారా ప్రజలకు భరోసా ఇవ్వడమే కాకుండా వారినుంచి సలహాలు సూచనలు  తీసుకుంటూ భవిష్యత్తు ఆశాకిరణంలా  వైయస్ జగన్ పరిణతి సాధించారని సజ్జల తెలిపారు.

విభజన జరిగిన 2014 నుంచి ఇప్పటివరకు బహుశా స్వాతంత్ర్యం అనంతరం ఏపి ఇంతలా ఎప్పుడూ సమస్యలు ఎదుర్కొలేదు. పాలకులు నిర్లక్ష్యం, నేటి పాలకుల అసమర్దత వల్ల  కొత్తగా తెచ్చుకున్న కష్టాలతో అభివృద్ది ఆగిపోవడమే కాదు,వెనకకు వెళ్లిందంటూ విమర్శించారు.వైయస్ రాజశేఖరరెడ్డి మనల్ని వదిలివెళ్లిన పది సంవత్సరాలు గడిచిందని గుర్తుచేస్తూ , ఈ మధ్యకాలంలోనే  వైయస్ జగన్ అధికారానికి చేరు కాగలిగినా, కుట్రల కారణంగా జైలు జీవితం, హత్యాయత్నంలాంటివి సైతం ఎదుర్కున్నారన్నారంటూఇలా యువనేత వైయస్ జగన్ మోహన్ రెడ్డి  అనేక ఆటుపోట్లు ఎదుర్కొన్నారు.పార్టీ పరంగా వ్యక్తిగతంగాను సమస్యలు, సంక్షోభాలు ఎదుర్కొన్న నేత  వైయస్ జగన్ తప్పితే మరొకరు లేరని అన్నారు. సంక్షోభాలను ధీటుగా ఎదుర్కొనేలా తయారైన  వైయస్ జగన్ కు అధికారం అందించేందుకు ప్రజలు సిధ్దంగా ఉన్నారని సజ్జల రామకృష్ణారెడ్డి స్పష్టం చేశారు.

3574 కిలోమీటర్లు,134 నియోజకవర్గాలు ,230 మండలాలు, రెండువేలకు పైగా గ్రామాలు , 124 బహిరంగసభలతో వైయస్ జగన్ ప్రజాసంకల్పయాత్ర సాగుతోందని పాదయాత్ర విశేషాలను వెల్లడించారు. రాష్ర్టంలోని అన్ని వర్గాల ప్రజలు జగన్ ను కలసి వారి సమస్యలు చెప్పుకుంటున్నారు.గతంలో బయటకు రాని వర్గాలు సైతం నేడు  జగన్ సమావేశాలకు,సభలకు హాజరయ్యారనీ, ఇప్పుడున్న పాలకులను ఒక్క క్షణం కూడా భరించలేం అనే భావన వారిలో కనిపిస్తోందని చెప్పారు. చంద్రబాబు ప్రభుత్వం అన్నిరకాలుగా తమను ఎలా హింసించిందో వారు బహిరంగంగా చెప్పే పరిస్దితి వచ్చిందన్నారు. రాష్ట్రాన్ని, తమ జీవితాలను మంచిగా మార్చలగరనే నమ్మకం ప్రజలలో నెలకొనడం వల్లనే పాదయాత్ర ఇంతగా విజ.యవంతమైందన్నారు.

2014లో చంద్రబాబు అదికారంలోకి వచ్చి 4 సంవత్సరాలపాటు రాష్ర్టాన్ని నిర్లక్ష్యం చేసి సమస్యలను పరిష్కరించక పోగా కొత్త సమస్యలు తెచ్చి వాటికి పరిష్కారం చూపలేదన్నారు. ఇప్పుడు ఎన్నికలకు ముందు  తిరిగి డ్రామాలు ప్రారంభించారని ప్రజలకు స్పష్టంగా అర్దమైపోతోందన్నారు. ఉద్యోగ ఖాళీలు 2 లక్షలు ఉంటే రిక్రూట్ మెంట్ నిర్వహించకుండా నేడు 1500 ఖాళీలు భర్తీ చేస్తామని ప్రకటించారన్నారు. చంద్రబాబు ప్రజలను సర్కస్ ,జూలలో జంతువుల్లా భావిస్తున్నారు.నాలుగు తాయిలాలు చూపి వారితో పనిచేయించుకోవాలనే తత్వం ఆయనలో కనిపిస్తోందని ధ్వజమెత్తారు. హైకోర్టు తరలింపులో సైతం ఆయన ఇచ్చిన అఫడవిట్  మరిచి జగన్ కోసం అర్జంట్ గా తరలించారని చంద్రబాబు బుకాయిస్తున్నారు. 40 ఏళ్ల అనుభవం ఉన్న చంద్రబాబు చిన్నపిల్లలకంటే హీనంగా ప్రవర్తిస్తున్నారని విమర్శించారు.  ఎదుటివారు పనికిరానివాళ్లు నేను మాత్రమే గొప్పవాడ్ని అని చంద్రబాబు అనుకుంటున్నారన్నారు.

ఇక జననేత వైయస్ జగన్ విషయానికి వస్తే అధిష్టానాన్ని ధిక్కరించి పయనించి కఠినపరీక్షలు ఎదుర్కొన్నారన, .ఆయనను భౌతికంగా ఎలిమినేట్ చేయాలని చూసినా దానిని సైతం ధైర్యంగా నిజాయితీ, ధృడచిత్తంతో ఎదుర్కొన్నారు. ఇవన్నీ చూస్తే దేశానికి ఒక అరుదైన నేత లభించాడని భావన తామందరిలోనూ ఉందని, ప్రజలు కూడా అది నమ్ముతున్నారు కాబట్టే ఆయన వద్దకు లక్షలాది మంది తరలివస్తున్నారన్నారు. 2019 సంవత్సరం జగన్ నామ సంవత్సరం అని భావిస్తున్నాం. రాష్ర్టానికి వైయస్ జగన్ మహర్దశను తెస్తారని అనుకుంటున్నామన్న విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. ఎన్నికలయ్యేంత వరకు వైయస్ జగన్ ప్రజల మధ్యనే ఉంటారనీ పేర్కొన్నారు. పాదయాత్రలో వివిధ వర్గాలకు ఇచ్చిన హామీలన్నీ కూడా మేనిఫెస్టోలో భాగమే అని,అవన్నీ ఆచరణ రూపం దాల్చేవే అని స్పష్టం చేశారు.

Back to Top