కోతల కష్టాలు తీరినట్టే...

రాష్ట్రం థర్మల్ పవర్ పై దృష్టి పెడుతూ విండ్ ఇంకా సోలార్ పవర్ ను కొనడం లేదంటూ అవాస్తవాలు ప్రచారం చేస్తున్నారు పచ్చ తమ్ముళ్లు. నిజాలేమిటో  చూద్దాం.

- కె.ఎస్.కె థర్మల్ కేంద్రానికి సోమవారం రోజు 120 కోట్లు విడుదల చేసింది ఏపీ ప్రభుత్వం

-  రాష్ట్రంలోని డిస్కంలు విద్యుత్ కొనుగోలు చేస్తున్నాయి.

- ఆదివారం విద్యుత్ డిమాండ్ 6897 మెగావాట్లు అందుబాటులో ఉన్నది 6670 మెగావాట్లు. 200 మెగావాట్లు మాత్రమే లోటు ఉంది.

- సోమవారం 7,200 మెగావాట్లు డిమాండ్ ఉండగా 6,940 మెగావాట్లు అందుబాటులో ఉంది. 900 మెగావాట్ల లోటును పూడ్చేందుకు పవర్ ఎక్సేంజ్ లో 680 నుంచి 1450 మెగావాట్లను డిస్కంలు కొనుగోలు చేసాయి.

- జెన్ కో ఉత్పత్తి  వరుసగా ఆదివారం 2,777, సోమవారం 2,550 మెగావాట్లు

- గత కొద్ది రోజులుగా వాతవరణ మార్పుల వల్ల పవన, సౌర విద్యుత్ ఉత్పత్తి గణనీయంగా తగ్గిపోయింది.

- 2018 సెప్టెంబర్ లో జెన్ కో పరిధిలో ఉన్న థర్మల్ విద్యుత్ కేంద్రాల్లో బొగ్గు నిల్వలు 29,543 మెట్రిక్ టన్నులు కాగా 2019 సెప్టెంబర్ నాటికి 46,486 మెట్రిక్ టన్నులు ఉంది.

- 16000 మెట్రిక్ టన్నులు అంటే దాదాపుగా రెట్టింపు బొగ్గు నిల్వలు ఉన్నాయి.

- బొగ్గు సరఫరా అంతరాయాన్ని అధిగమించేందుకు అదనపు నిల్వలు ఉపయోగపడ్డాయి.

- సింగరేణి నుంచి రోజుకు 8 ర్యాక్ల బొగ్గు రాబోతోంది.

Back to Top