మళ్లీ వైయ‌స్‌ జగన్‌నే గెలిపించుకుందాం

వైయ‌స్ఆర్‌సీపీ మ‌హిళా అధ్య‌క్షురాలు పోతుల సునీత‌
 

విజ‌య‌వాడ‌: వ‌చ్చే ఎన్నిక‌ల్లో ముఖ్య‌మంత్రిగా మ‌ళ్లీ వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డిని గెలిపించుకుందామ‌ని వైయ‌స్ఆర్‌సీపీ మ‌హిళా అధ్య‌క్షురాలు పోతుల సునీత పిలుపునిచ్చారు. విజ‌య‌వాడ‌లో నిర్వ‌హించిన వైయ‌స్ఆర్‌సీపీ బీసీ జ‌య‌హో స‌భ‌లో సునీత మాట్లాడారు. సంక్షేమ ప‌థ‌కాల‌తో సామాజిక విప్ల‌వం సృష్టించిన నాయ‌కుడు వైయ‌స్ జ‌గ‌న‌న్న మ‌న బీసీ పాలిట పూలే, అంబేడ్క‌ర్‌... 2024లో తెలుగుదేశం పార్టీని భూస్థాపితం చేసేది కూడా మ‌న బీసీలే..బీసీల‌కు రాజ్యాధికారం దిశ‌గా ఇన్ని ప‌ద‌వులు ఇచ్చిన జ‌గ‌న‌న్నకు మ‌నం రుణ‌ప‌డి ఉండాలి..రాబోయే ధ‌ర్మ‌యుద్దంలో జ‌గ‌న‌న్నకు మ‌నం అండ‌గా నిల‌బ‌డితేనే మ‌న పిల్ల‌ల‌ను ఉన్న‌త చ‌దువులు చ‌దివించుకోగ‌లం.. చంద్ర‌బాబు బీసీల‌ను రాజ‌కీయంగా వాడుకున్నారు..దుష్ట‌చ‌తుష్ట‌యానికి బుద్ధిచెప్పి, 2024 త‌ర్వాత తెలుగుదేశం పార్టీ ఉనికే ఉండ‌కుండా చేసే బాధ్య‌త మ‌నంద‌రిదీ...మళ్లీ జగన్‌నే గెలిపించుకుందాం
సీఎం వైయ‌స్‌ జగన్‌ నాయకత్వంలోనే సామాజిక న్యాయం జరిగిందని పోతుల సునీత పేర్కొన్నారు. ఇక్కడి బీసీ నినాదాలు చంద్రబాబు గుండెల్లో వణుకు పుట్టించాలన్నారు ఆమె. బీసీల కోసం ఇంతలా కష్టపడే ముఖ్యమంత్రిని ఎవరం చూడలేదని ఆమె పేర్కొన్నారు. ధర్మానికి-అధర్మానికి.. నిజానికి-అబద్ధానికి రాబోయే రోజుల్లో యుద్ధానికి సిద్ధం కావాలని బీసీలను కోరారు ఆమె. సంక్షేమ పథకాలు కొనసాగాలన్న.. మంచి పాలన అందాలన్నా సీఎం జగన్‌నే మళ్లీ సీఎంగా చేసుకుందామని, దుష్టచతుష్టయానికి గట్టిగా బుద్ధి చెప్పాలని పోతుల సునీత‌ పిలుపు ఇచ్చారు.

Back to Top