వైయస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్సీ అభ్యర్థిగా పోతుల సునీత

బీఫాం అందజేసిన సీఎం వైయస్‌ జగన్‌

తాడేపల్లి: శాసనమండలిలో ఖాళీ అయిన ఎమ్మెల్సీ స్థానానికి వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థిగా పోతుల సునీతను ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ ప్రకటించారు. ఈ మేరకు సీఎం వైయస్‌ జగన్‌ చేతుల మీదుగా పోతుల సునీత బీఫాం అందుకున్నారు. ఎమ్మెల్సీ అభ్యర్థిగా తనను ప్రకటించినందుకు గానూ.. సీఎం వైయస్‌ జగన్‌ను మర్యాదపూర్వకంగా కలిసి కృతజ్ఞతలు తెలిపారు. పోతుల సునీత వెంట విద్యుత్‌ శాఖ మంత్రి బాలినేని శ్రీనివాస్‌ రెడ్డి, రాజ్యసభ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్‌ రెడ్డి, పోతుల సురేష్‌ ఉన్నారు. 

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top