ప్రజా కోర్టులో కూడా చంద్రబాబు శిక్ష తప్పదు

 మంత్రి గుడివాడ అమర్నాథ్‌ 
 

విశాఖపట్నం: పలు కేసుల్లో బెయిల్‌ మీద బయట తిరుగుతున్న దొంగ చంద్రబాబుకు ప్ర‌జా కోర్టులో కూడా శిక్ష త‌ప్ప‌ద‌ని మంత్రి గుడివాడ అమర్నాథ్ ఘాటు విమర్శలు చేశారు. స్కిల్‌ స్కాం కేసులో సుప్రీంకోర్టు తీర్పులపై అమర్నాథ్‌ స్పందించారు. చంద్రబాబుకు సుప్రీంకోర్టులో ఎలాంటి ఊరట లభించలేదన్నారు. 

మంత్రి అమర్నాథ్‌ మీడియాతో మాట్లాడుతూ..‘ఎల్లో మీడియా చంద్రబాబుకు ఊరట లభించిదంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నాయి. సుప్రీంకోర్టులో చంద్రబాబు ఎలాంటి ఊరట లభించలేదు. 17ఏ అమలులోకి రాకముందు ఉన్న కేసు స్కిల్‌ డెవలప్‌మెంట్‌ స్కాం కేసు. ఈ కేసులో వాళ్లు ఎక్కడా తప్పు చేయలేదని చంద్రబాబు మాట్లాడటం లేదు. తాను అవినీతికి పాల్పడలేదని చంద్రబాబు చెప్పడం లేదు. 

రాష్ట్ర పరిశ్రమలు,ఐటీ శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్‌ మీడియాతో ఏం మాట్లాడారంటే:*

 

ఇచ్చిన తీర్పేంటి..? మీరు చేసే ప్రచారం ఏంటి..?:

– కొన్ని చానళ్లు గొప్ప విజయం సాధించాం..చంద్రబాబుకు ఏదో ఊరట కలిగింది, ఆయన సుప్రీం కోర్టులో వేసిన కేసులో ఆయనకు అనుకూలంగా తీర్పు వచ్చినట్లుగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నాయి. 

– దీన్ని చూస్తే 2019లో చంద్రబాబుకు వచ్చిన 23 సీట్లను గొప్ప విజయంగా చూపిస్తే ఏ రకంగా ఉంటుందో నేడు అదే విధంగా కనిపిస్తోంది. 

– అసలు జరిగిన కేసేంటి..వాదనలేంటి? ఇచ్చిన తీర్పు చూసిన తర్వాత నాకు తెలిసి చంద్రబాబుకు ఏ రకమైన రిలీఫ్‌ కలగలేదు. 

– వాస్తవానికి ముందుగా గమనించాల్సింది ఏంటంటే 17ఏ వర్తిస్తుందా లేదా అనేది అది ఒక ప్రొసీజర ల్‌ సెక్షన్‌ మాత్రమే. 

– 2018లో అమల్లోకి వచ్చిన ఈ సెక్షన్‌ ఈ కేసుకు వర్తించదు..స్కిల్‌ స్కాం అనేది 2015 ప్రాంతంలోనే జరిగింది. 

– ఈ  క్రమంలో చంద్రబాబు, వారీ పార్టీ వారు, వారి లాయర్లు ఎక్కడా బాబు తప్పుచేయలేదు అనడం లేదు. 

– రూ. 370 కోట్ల ప్రజా ధనాన్ని నేను దోచుకోలేదని ఎక్కడా వారి వాదనల్లో లేదు. 

– గవర్నర్‌ అనుమతి లేదనో, స్పీకర్‌ చెప్పలేదనో 17ఏని చూపించి క్వాష్‌ చేయండని కోరారు. 

 

ఇద్దరు జడ్జిలు రిమాండ్‌ ప్రక్రియలో లోపం లేదనే ఏకాభిప్రాయాన్ని చెప్పారు:

– ఈ రోజు ఇచ్చిన తీర్పులో జడ్జిలు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేశారు. 

– అయితే ఇద్దరూ కామన్‌గా రిమాండ్‌ తీసుకోవడంలో అంతా పద్దతి ప్రకారమే జరిగిందని చెప్పారు. 

– గతంలో కూడా ఓటుకు నోటు కేసులో దొరికిపోయినప్పుడు కూడా ఇదే రకమైన వాదనలు చేశారు. 

– సెక్షన్‌ 8 అమల్లో ఉంది..మీకూ పోలీసులున్నారు..మాకూ ఉన్నారు..మీకూ ఏసీబీ ఉంది మాకూ ఉంది అంటూ మాట్లాడారు. 

– ఇలాంటి వితండ వాదం చేసి తప్పించుకునే ప్రయత్నం చేశారు. 

– గతంలో సెక్షన్‌ 17ఏ అనేది వర్తించదని దాదాపు 6 కోర్టులు చెప్పాయి. 

– అంత క్లియర్‌గా ఉంటే..దానికి అనుగుణంగా విచారణ సంస్థలు ఫైట్‌ చేస్తున్నాయి. 

– ఈ రోజు వచ్చిన తీర్పు చూసిన తర్వాత చంద్రబాబు బోనులో నిలబడి న్యాయస్థానం, విచారణ సంస్థల ముందు దొంగలా నిలబడి సమాధానం చెప్పాల్సి ఉంది. 

– 52 రోజులు జైలు శిక్ష అనుభవించి, ఆరోగ్య కారణాలు చెప్పి బెయిల్‌పై ఉన్న ఒక దొంగే తప్ప నిజాయితీపరుడు, అమాయక చక్రవర్తి అని న్యాయస్థానాలు చెప్పలేదు. 

– ఈ రోజు వచ్చిన తీర్పును వారికి నచ్చినట్లు అన్వయించుకుని ప్రచారం చేసుకుంటున్నారు. 

– ఎంత సేపూ తప్పు చేయలేదని చెప్పరు..చేసిన విధానం బాగాలేదంటూ మాట్లాడుతున్నారు. 

– మీరు చేసిన దొంగపని విచారణ సంస్థలు, కేంద్ర సంస్థలు అంగీకరించాయి కాబట్టి ఆయన రిమాండ్‌కు వెళ్లాడు. 

– ఈ రోజు కేసు కొట్టేసినట్లు ఎల్లో మీడియా బాకాలు కొట్టుకుంటోంది. 

– ప్రజల్ని తప్పుదోవ పట్టించే విధంగా ప్రచారం చేస్తున్నారు. చంద్రబాబు చేతికి పడిన సంకెళ్లు, ఆయనపై పడ్డ మచ్చను నిరూపించుకోవాలి. 

– వీటన్నిటికన్నా మించి రేపు ప్రజా క్షేత్రంలో ప్రజలు నిర్ణయింస్తారు. చంద్రబాబు చేసిన తప్పును ప్రజలు గమనిస్తున్నారు. తప్పకుండా ప్రజాకోర్టులో మరొకసారి శిక్ష పడే రోజు త్వరలోనే ఉంది. 

 

– క్యాబినెట్‌లో పెట్టినదానికి, స్కిల్‌ స్కాంలో చేసిన దానికి అసలు సంబంధమే లేదు. 

– అసలు ఫైల్‌ ముఖ్యమంత్రి వద్దకే రాదంటూ మంత్రిగా చేసిన వ్యక్తి మాట్లాడుతున్నాడు. అసలు గెలవకుండానే మంత్రి అయిన వ్యక్తికి అంతకంటే ఏం తెలుస్తుంది..? 

– 17ఏ అనేది నీకు, జరిగిన అవినీతికి సంబంధం లేదు అనేది కాదు కదా? 

– దాన్ని కేసుకు ముడిపెట్టి ప్రజల్ని తప్పుదోవపట్టిస్తున్నారు. 

– నా సీటు గురించి మీరెందుకు గాబరా పడుతున్నారు..? మూడు లిస్టులు కాకపోతే..నాలుగు..లేదంటే పార్టీకి పనిచేస్తా. 

 

*లేని పార్టీకి ఎవరు అధ్యక్షులైతే మాకెందుకు..?:*

– ఈ రాష్ట్రంలో లేని పార్టీకి ఎవరు అధ్యక్షులు అయితే మాకేంటి? 

– గత ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీకి 0.4 శాతం నోటా కంటే తక్కువ వచ్చింది. 

– అటువంటి లేని పార్టీ గురించి చర్చించుకోవడం అనవసరం. 

– రాజకీయాల్లో ఉన్న వాళ్లకు అన్నదమ్ములు చాలా మందికి ఉంటారు. ఉన్నోరంతా ప్రధానులు, రాష్ట్రపతులు కాలేరు కదా? 

– ఈ రాష్ట్రంలో కాంగ్రెస్‌ పార్టీకి సీట్లు కాదు కదా ఓట్లేసే వారు లేరు. 

– దానికి ఈ రాష్ట్రానికి వారు చేసిన అన్యాయం కారణం..మనం కలిసి నిర్మించుకున్న ఉమ్మడి రాష్ట్రాన్ని విడగొట్టింది వారు. 

– రాష్ట్ర భవిష్యత్తును గొడ్డలితే నరికిన పార్టీ కాంగ్రెస్‌. అలాంటి పార్టీ ఈ రాష్ట్రానికి ఉండకూడదు అని ప్రజలు అనుకున్నారు. అలానే లేకుండా చేశారు. 

– నాకు తెలిసి ఆ పార్టీ ప్రభావం జీరో అనేదే నా అభిప్రాయం. 

Back to Top