పోలీసులు అధికార పార్టీకి తొత్తులుగా మారారు

వైయస్‌ఆర్‌ సీపీ ప్రకాశం జిల్లా అధ్యక్షుడు బాలినేని శ్రీనివాస్‌రెడ్డి

ప్రకాశం: పోలీసులు అధికార పార్టీకి తొత్తులుగా వ్యవహరిస్తున్నారని ప్రకాశం జిల్లా వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు, మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్‌రెడ్డి ధ్వజమెత్తారు. వైయస్‌ఆర్‌ సీపీ నేతలపై అక్రమ కేసులు బనాయించి హింసిస్తున్నారని ధ్వజమెత్తారు. వైయస్‌ఆర్‌ సీపీ నేత సింగరాజు వెంకట్రావు సహా ఆరుగురి అరెస్టును బాలినేని తీవ్రంగా వ్యతిరేకించారు. టీడీపీ ఎమ్మెల్యే దామచర్ల ఒత్తిడితోనే వైయస్‌ఆర్‌ సీపీ నేతలపై అక్రమ కేసులు బనాయిస్తున్నారని ధ్వజమెత్తారు. తన కుమారుడు ప్రణీత్‌రెడ్డిపై కూడా అక్రమంగా కేసు పెట్టారని, పోలీసులు అధికార పార్టీ అడుగులకు మడుగులు ఒత్తుతున్నారన్నారు. టీడీపీ అరాచకాలకు ఒంగోలు ఘటనే నిదర్శనమన్నారు. 

Back to Top