ప్రధాని వీడియో కాన్ఫరెన్స్‌లో సీఎం వైయస్‌ జగన్‌

న్యూఢిల్లీ : కరోనా వైరస్‌పై పోరులో తదుపరి చర్యలను చర్చించేందుకు ప్రధానమంత్రి మోదీ రాష్ట్రాల ముఖ్యమంత్రులతో వీడియో కాన్ఫరెన్స్‌ సమావేశం ప్రారంభమైంది. ఈ భేటీలో ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి, రాష్ట్రానికి చెందిన ఉన్నతాధికారులు పాల్గొన్నారు. మే 3 తరువాత లాక్‌డౌన్‌ను కొనసాగించడమా? లేక దశలవారీగా ఎత్తివేయడమా? అనే విషయంపై ఈ సమావేశంలో చర్చిస్తున్నారు.  లాక్‌డౌన్‌ ఎత్తివేతపై అనుసరించాల్సిన వ్యూహాన్ని కూడా వారు చర్చిస్తారు. అలాగే ఆయా రాష్ట్రాల్లో ప్రస్తుత పరిస్థితులను, కరోనా నియం‍త్రణకు చేపడుతున్న చర్యలను ప్రధానికి ముఖ్యమంత్రులు వివరిస్తున్నారు.  

తాజా వీడియోలు

Back to Top