సీఎం వైయ‌స్ జగన్‌కు బర్త్‌ డే విషెస్‌ తెలిపిన ప్రధాని మోదీ

 అమరావతి: ముఖ్యమంత్రి వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి పుట్టిన రోజు సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు ఆయన ట్విట్టర్ ద్వారా సీఎం వైయ‌స్ జగన్‌ను విష్ చేశారు. సీఎం వైయ‌స్ జగన్ ఆయురారోగ్యాలతో, సంతోషంగా ఉండాలని ప్రధాని ఆకాంక్షించారు 

సీఎం వైయ‌స్ జగన్‌ పుట్టిన రోజు పురస్కరించుకుని గురువారం రెండు తెలుగు రాష్ట్రా­లతో పాటు ఇతర రాష్ట్రాలు, విదేశాల్లో భారీఎ­త్తున సేవా కార్యక్రమాలను వైయ‌స్ఆర్‌సీపీ శ్రేణులు చేపట్టాయి. ఇందులో భాగంగా రాష్ట్రంలోని అన్ని నియో­జకవర్గాల్లో మొక్కలు నాటడంతో పాటు అన్న­దానం, వస్త్రదానాలు చేస్తున్నారు. ఆస్పత్రుల్లో రోగులకు పండ్లు పంపిణీ  చేస్తున్నారు. రక్తదాన శిబిరాలు కూడా రాష్ట్రవ్యాప్తంగా నిర్వహిస్తున్నారు. 

Birthday wishes to Andhra Pradesh CM Shri @ysjagan Garu. May he lead a long and healthy life.

— Narendra Modi (@narendramodi) December 21, 2023

గవర్నర్‌ శుభాకాంక్షలు.. 
ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర గవర్నర్‌ జస్టిస్‌ అబ్దుల్‌ నజీర్‌ కూడా ముఖ్యమంత్రి వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డికి హృదయపూర్వకంగా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు.  

I extend my heartiest felicitations and warm greetings to Sri Y.S. Jagan Mohan Reddy, Chief Minister of Andhra Pradesh on his Birthday. pic.twitter.com/75KTexNMbI

— governorap (@governorap) December 21, 2023

Back to Top