అగ్నిప్ర‌మాద ఘ‌ట‌న‌పై సీఎం వైయ‌స్ జ‌గ‌న్‌కు ప్ర‌ధాని ఫోన్‌

విజ‌య‌వాడ‌: అగ్నిప్ర‌మాద ఘ‌ట‌న‌పై ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డికి ప్ర‌ధానమంత్రి న‌రేంద్ర‌మోడీ ఫోన్ చేశారు. ఘ‌ట‌న‌కు సంబంధించిన వివ‌రాల‌ను సీఎం వైయ‌స్ జ‌గ‌న్ ప్ర‌ధానికి వివ‌రించారు. ఓ ప్రైవేట్ ఆస్ప‌త్రి హోట‌ల్‌ను లీజుకు తీసుకొని అందులో క‌రోనా రోగుల‌ను ఉంచింద‌ని, తెల్ల‌వారుజామున అగ్నిప్ర‌మాదం సంభ‌వించింద‌ని సీఎం వివ‌రించారు. అధికారులు వెంట‌నే స‌హాయ‌చ‌ర్య‌లు చేప‌ట్టార‌ని, దుర‌దృష్ట‌వ‌శాత్తు కొంత‌మంది మృతిచెందార‌ని చెప్పారు. క్ష‌త‌గాత్రుల‌కు మెరుగైన వైద్యాన్ని అందించాల్సిందిగా అధికారుల‌ను ఆదేశించామ‌ని, బాధితుల‌ను అన్ని ర‌కాలుగా ఆదుకుంటామ‌ని ప్ర‌ధానికి తెలిపారు. అదే విధంగా మృతుల కుటుంబాల‌ను ఆదుకునేందుకు ఒక్కో కుటుంబానికి రూ.50ల‌క్ష‌ల చొప్పున ప‌రిహారం కూడా ప్ర‌క‌టించామ‌ని సీఎం వైయ‌స్ జ‌గ‌న్ ప్ర‌ధానికి తెలిపారు.

 

తాజా వీడియోలు

Back to Top